AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..! ఎవరైనా కొట్టి చంపుతారు.. మీరేంటి ఇలా

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ రాజా సాబ్ ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లలో విడుదలైన మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. కేవలం ప్రభాస్ అనే బ్రాండ్ ఇమేజ్, ఆయన స్టార్‌డమ్‌తో బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల మార్క్ దాటేసింది.

జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..! ఎవరైనా కొట్టి చంపుతారు.. మీరేంటి ఇలా
Raja Saab
Rajeev Rayala
|

Updated on: Feb 07, 2026 | 7:37 AM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా హారర్ కామెడీ కావడంతో సినిమా ఆపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో జరిగాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా పక్కా హిట్ అని ఫిక్స్ అయ్యారు. తీరా థియేటర్స్ లోకి సినిమా వచ్చిన తర్వాత మారుతి చెప్పినంత లేకపోవడంతో నిరాశపడ్డారు ఫ్యాన్స్. ప్రభాస్ రేంజ్ కు తగ్గ సినిమా కాదు అని అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. థియేటర్స్ లో డివైడ్ టాక్ తెచ్చుకున్న రాజా సాబ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

ఫిబ్రవరి 6 (శుక్రవారం) నుంచి రాజా సాబ్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసింది. ఓటీటీలో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షుకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇప్పుడు జియో హాట్ స్టార్ కు ప్రభాస్ అభిమానులు షాక్ ఇచ్చారు. రాజా సాబ్ సినిమా విడుదలకు ముందు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు మారుతి. సినిమా ఏమాత్రం నిరాశపరిచిన తన ఇంటికి వచ్చేయండి అంటూ అడ్రస్ చెప్పాడు.

దాంతో ప్రభాస్ అభిమానులు మారుతి ఇంటికి భారీగా బిర్యానీలు ఆర్డర్ లు పెట్టారు.ప్ దాంతో రోజుకు పదుల సంఖ్యలో బిర్యానీలను ప్రభాస్ అభిమానులు మారుతి ఇంటికి ఆన్ లైన్ డెలివరీ పెట్టారు. అయితే ఆ ఆర్డర్స్ అన్నీ క్యాష్ ఆన్ డెలివరీ కావడంతో మారుతి సిబ్బందికి తిప్పలు వచ్చిపడ్డాయి. కాగా ఇప్పుడు ప్రభాస్ అభిమానులు జియో హాట్ స్టార్ ఆఫీసు కు పెద్దెత్తున బిర్యానీలు ఆర్డర్ పెట్టారు. ఇంతకు సంబంధించిన ఫోటోను జియో హాట్ స్టార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. లవ్వే.. ఇదంతా లవ్వే.. ఎవరైనా కొట్టి చంపుతారు మీరు పెట్టి చంపుతున్నారు అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర