Prabhas : 4 నెలల్లో షూటింగ్ కంప్లీట్.. 17 ఏళ్ల ప్రభాస్ సినిమాపై డైరెక్టర్ మెహర్ రమేష్ ఆసక్తికర ట్వీట్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సంక్రాంతి పండక్కి రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డార్లింగ్.. అటు ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ నటించిన ఓ సూపర్ హిట్ మూవీ విడుదలై నేటికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మెహర్ రమేష్ సోషళ్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ కెరీర్ మలుపు తిప్పిన చిత్రాల్లో బిల్లా ఒకటి. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో అనుష్క శెట్టి, నమిత హీరోయిన్లుగా నటించారు. 2009 వేసవిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రభాస్ కెరీర్ లో అత్యంత స్టైలిష్ మూవీగా నిలిచింది. ఈ మూవీ విడుదలై నేటికి 17 సంవత్సరాలు పూర్తైంది. ఈ క్రమంలోనే #17yearsforBilla అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మరోవైపు డైరెక్టర్ మెహర్ రమేష్ సైతం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..
బిల్లా సినిమాను కేవలం 4 నెలల్లోనే పూర్తి చేశామని అన్నారు. మన గుండెల్లో నిలిచిపోయిన డాన్ ప్రభాస్ అని అన్నారు. బిల్లా.. స్టైల్ అండ్ స్వాగ్ కు సరికొత్త నిర్వచనం. మ్యూజిక్ సృష్టించిన మ్యాజిక్. విజన్ ను మ్యాచ్ చేసిన మేకింగ్. చాలా ఫాస్ట్ గా తెరకెక్కించిన సినిమా. కేవలం 4 నెలల్లోనే రూపొందించాం. 2008 నవంబర్ 12న షూటింగ్ స్టార్ట్ చేసి.. 2009 ఏప్రిల్ 3 రిలీజ్ చేశాం. రెబల్ స్టార్ మన హృదయాల డాన్ ప్రభాస్. బిల్లాకు 17 సంవత్సరాలు అంటూ రాసుకొచ్చారు.అలాగే తన ట్వీట్ కు #17yearsforBilla అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..
ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. బిల్లా.. రంగా అనే రెండు పాత్రలలో తన స్టైలింగ్, స్వాగ్, బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ సూట్స్ లో డార్లింగ్ లుక్స్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఇందులో కృష్ణంరాజు, జయసుధ, అలీ, ప్రవీణ్ కీలకపాత్రలు పోషించగా.. హాన్సిక మోత్వానీ స్పెషల్ సాంగ్ చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Puri Jagannadh : బద్రి సినిమాలో యాక్టింగ్.. ఆ నటికి ప్రతి నెల డబ్బులు పంపుతున్న పూరి.. కారణం ఇదే..
BILLA Style n swag redefined Music made Magic Making matched Vision Fastest made film “in just 4 months”Nov12th 2008 Filming started April3rd 2009 released RebelStar our Don of Hearts #prabhas ❤️ #Billa 🔥#17yearsforBilla 🎉 @GopiKrishnaMvs #krishnamrajugaru #narendra… pic.twitter.com/3S4DIaWao3
— Meher Raamesh (@MeherRamesh) April 3, 2026
ఎక్కువ మంది చదివినవి : Prakash Raj : క్రైస్తవ సంప్రదాయంలో తల్లి అంత్యక్రియలు.. ట్రోల్స్ పై మండిపడ్డ ప్రకాష్ రాజ్..
