AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా బౌలింగ్‌లో మార్పుల వెనుక ఓ ‘మిస్టరీ మ్యాన్’..: నితీష్ కుమార్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Nitish Kumar Reddy: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ కెరటం నితీష్ కుమార్ రెడ్డి విశ్వరూపం ప్రదర్శించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రాణించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తొలి మ్యాచ్‌లో తడబడినప్పటికీ, రెండో మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచి విమర్శకుల నోళ్లు మూయించాడు.

నా బౌలింగ్‌లో మార్పుల వెనుక ఓ 'మిస్టరీ మ్యాన్'..: నితీష్ కుమార్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Nitish Kumar Reddy Ipl 2026
Venkata Chari
|

Updated on: Apr 03, 2026 | 8:19 PM

Share

Nitish Kumar Reddy: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు. తొలుత బ్యాటింగ్‌లో 39 పరుగులు చేసిన నితీష్, ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రెండు కీలక వికెట్లు తీసి సన్‌రైజర్స్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌లో గాయాల కారణంగా ఇబ్బంది పడిన ఈ యువ ఆటగాడు, ఈ ఏడాది తన బౌలింగ్ శైలిని పూర్తిగా మార్చుకుని ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తన బౌలింగ్ మెరుగుపడటం వెనుక ఒక ప్రత్యేక వ్యక్తి ఉన్నారని నితీష్ వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బౌలింగ్ రహస్యంపై నితీష్ ఏమన్నారంటే?

విజయం అనంతరం నితీష్ మాట్లాడుతూ.. తన బౌలింగ్ మెరుగుదలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. “నేను నా బౌలింగ్ విషయంలో నిరంతరం శ్రమిస్తుంటాను. గత ఏడాది గాయాల వల్ల సాధన చేయడానికి తగిన సమయం దొరకలేదు. కానీ ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఒక వారం పాటు ఒక ప్రత్యేక వ్యక్తి పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నాను. ఆయన ఇచ్చిన సూచనలు ఇప్పుడు మైదానంలో అమలు చేస్తున్నాను. అయితే ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పుడే బయట పెట్టను, త్వరలోనే వెల్లడిస్తాను” అని నితీష్ సస్పెన్స్ మెయింటైన్ చేశాడు.

పిచ్ పరిస్థితులు, వ్యూహాల అమలు..

ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ అనుకూలంగా ఉంటుందని నితీష్ పేర్కొన్నాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే పిచ్ నెమ్మదిగా ఉందని గమనించినట్లు చెప్పాడు. “కోల్‌కతా బౌలర్లు స్లో బౌన్సర్లు వేయడం చూశాక, మేము బౌలింగ్ చేసేటప్పుడు కూడా అదే వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. రింకూ సింగ్ వంటి ప్రమాదకరమైన బ్యాటర్ వికెట్‌ను స్లో బంతి ద్వారానే పడగొట్టాను. పిచ్ పరిస్థితులను గౌరవించి బౌలింగ్ చేయడం వల్లే ఫలితం దక్కింది” అని వివరించాడు.

ఇవి కూడా చదవండి

సీనియర్ల సూచనలు..

హెన్రిచ్ క్లాసెన్‌తో కలిసి ఆడటం గొప్ప అనుభూతిని ఇచ్చిందని నితీష్ తెలిపాడు. సీనియర్ ఆటగాళ్లు ఇచ్చే సూచనలు యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడతాయని అన్నాడు. అలాగే తమ బౌలింగ్ విభాగంపై వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశాడు. జయదేవ్ ఉనద్కత్ వంటి సీనియర్లతో పాటు హర్షల్ పటేల్, డేవిడ్ పైన్ వంటి నాణ్యమైన బౌలర్లు తమ జట్టులో ఉన్నారని, హైదరాబాద్‌లోని ఫ్లాట్ వికెట్లపై బౌలింగ్ చేయడం ఒక సవాల్ అని నితీష్ స్పష్టం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కీరదోస రహాస్యాలు ఇవే..
అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కీరదోస రహాస్యాలు ఇవే..
29 బంతుల్లో ఇచ్చిపడేసిన బుడ్డోడు..
29 బంతుల్లో ఇచ్చిపడేసిన బుడ్డోడు..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాన్ కార్డులు ఇనాక్టివ్..
దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాన్ కార్డులు ఇనాక్టివ్..
ప్రభాస్ సినిమాకు 17 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన డైరెక్టర్ మెహర్
ప్రభాస్ సినిమాకు 17 ఏళ్లు.. ఆసక్తికర పోస్ట్ చేసిన డైరెక్టర్ మెహర్
మజ్జిగ వీరికి విషంతో సమానం.. తాగితే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?
మజ్జిగ వీరికి విషంతో సమానం.. తాగితే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?
నా బౌలింగ్ మార్పుల వెనుక ఓ 'మిస్టరీ మ్యాన్'..: నితీష్ కుమార్
నా బౌలింగ్ మార్పుల వెనుక ఓ 'మిస్టరీ మ్యాన్'..: నితీష్ కుమార్
మనిషికి చెడు కాలం వచ్చే ముందు కనిపించే 5 సంకేతాలు..
మనిషికి చెడు కాలం వచ్చే ముందు కనిపించే 5 సంకేతాలు..
పారడైజ్ దగ్గరకు ఆటోలో ఒంటరిగా వచ్చిన మహిళ.. అనుమానంతో చెక్ చేయగా
పారడైజ్ దగ్గరకు ఆటోలో ఒంటరిగా వచ్చిన మహిళ.. అనుమానంతో చెక్ చేయగా
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్.. కారణమిదే..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..
కరివేపాకు చెట్టు పెరగటం లేదా? ఇలా చేశారంటే గుబురుగా పెరుగుతుంది..