ముదిగుబ్బ మండలం టి.ఎన్ పాళ్యం ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో ఓ ఐచర్ వాహనం 50 అడుగుల లోయలో పడింది. కట్టెలు లోడుతో వెళ్తున్న ఈ వాహనం ప్రమాదవశాత్తు రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.