షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన వంటగ్యాస్ ధర.. ఎంతంటే?
దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరపై రూ.29 పెంపు అమల్లోకి వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.996కు చేరగా, ఢిల్లీలో రూ.942గా నమోదైంది. గత మూడు నెలల్లో ఇది రెండో ధరల పెంపు కావడం గమనార్హం. పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోంది.
ఆదివారం పూట రిలాక్స్‌గా నిద్రలేచిన సామాన్యుడికి చమురు సంస్థలు గట్టి షాకిచ్చాయి. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలతో సతమతమవుతున్న దేశ ప్రజలపై మరోసారి ధరల పిడుగు పడింది. గృహ వినియోగ వంటగ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ చమురు-సహజవాయు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా డొమెస్టిక్ సిలిండర్ ధరపై రూ.29 పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ పెంచిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి. గడిచిన మూడు నెలల వ్యవధిలో గృహ వినియోగ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా మార్చి 7న సిలిండర్ ధరపై ఏకంగా రూ. 60 పెంచారు. తాజాగా మరో రూ. 29 భారం పడటంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 913 నుంచి రూ. 942కు చేరింది. హైదరాబాద్‌లో ఇప్పటివరకు రూ. 967 గా ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధర, తాజా నిర్ణయంతో రూ. 996కు పెరిగింది. అంటే వెయ్యి రూపాయలకు కేవలం నాలుగు రూపాయల దూరంలో నిలిచింది. ఒకవైపు కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరుగుతుండగానే, ఇప్పుడు ఇళ్లల్లో వాడే గ్యాస్ బండ కూడా మరింత భారం కావడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కస్టమర్లను ముంచేసిన గోల్డ్ అప్రైజర్.. రూ.40 లక్షల బంగారంతో పరార్
చెరువుపై పడ్డ ఊరు.. మొత్తం ఊడ్చేశారుగా
‘అణు చెత్త’ను తొలిసారిగా సమాధి చేస్తున్న ఫిన్లాండ్
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. ఈ టెక్నాలజీ వస్తే.. అందరికీ జీరో బిల్లులే
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. అందరికీ జీరో బిల్లులే
బైక్ ట్యాక్సీ రైడర్‌గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా
పరుపులతో ప్రాణాలు కాపాడిన హీరోలు!
కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్
దారుణం.. చిన్నారి కాలి ఎముకను విరగ్గొట్టిన డాక్టర్.. కారణం ఇదే

