AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. ఈ టెక్నాలజీ వస్తే.. అందరికీ జీరో బిల్లులే

కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. ఈ టెక్నాలజీ వస్తే.. అందరికీ జీరో బిల్లులే

Phani CH
|

Updated on: Jun 08, 2026 | 12:59 PM

Share

సింగపూర్‌లోని నాన్‌యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అత్యంత పలుచని, పారదర్శకమైన పెరోవ్‌స్కైట్ సోలార్ సెల్స్‌ను అభివృద్ధి చేశారు. వీటిని కిటికీలు, అద్దాలపై అమర్చి సూర్యకాంతి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. భవనాలు, వాహనాలు, స్మార్ట్ గ్లాసెస్ వంటి పరికరాల్లో వీటి వినియోగానికి భారీ అవకాశాలున్నాయి. భవిష్యత్తులో ఇవి శక్తి ఉత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చు.

మీ ఇంట్లో కిటికీల సంఖ్యను డబుల్‌ చేసుకోండి. వీలైతే మీ బిల్డింగ్‌కి వీలున్నన్ని అద్దాలు బిగించండి. ఎందుకంటే కిటికీలు, అద్దాలే విద్యుదుత్పత్తి కేంద్రాలు కానున్నాయి. సూర్యుడి వెలుతురు నుంచి విద్యుత్‌ను అందించడం వీటి ప్రత్యేకత. సింగపూర్‌లోని నాన్‌యాంగ్‌ యూనివర్సిటీ రీసెర్చ్‌ బృందం సోలార్‌ సెల్స్‌ను ఆవిష్కరించింది. అత్యంత పలుచగా ఉండటమే కాకుండా పెరోవ్‌స్కైట్‌ సోలార్‌ సెల్స్‌ను నేరుగా కిటికీలు, అద్దాలపై ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం సోలార్‌ పానెళ్లల్లో ఉపయోగించే సెల్స్‌ సిలికాన్‌తో తయారవుతోంది. సిలికాన్‌ ఖరీదు చాలా ఎక్కువ. సామర్థ్యం విషయంలోనూ పరిమితులున్నాయి. బిగించడం, వాడకంలోనూ ఇబ్బందులున్నాయి. నాన్‌యాంగ్‌ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన సరికొత్త perovskite సోలార్‌ సెల్స్‌ ఎంత మందం ఉంటాయో తెలుసా? కేవలం పది నానోమీటర్లు. అంటే మనిషి వెంట్రుక కంటే పది వేల రెట్లు తక్కువ మందం అన్నమాట. పైగా ఈ సెల్స్‌పై పడే కాంతిలో 41 శాతం నేరుగా ప్రసారమయ్యేంత పారదర్శకంగా ఉంటాయి. అయితే ఇలా పారదర్శకంగా ఉంచేందుకు దీని విద్యుదుత్పత్తి సామర్థ్యం విషయంలో కొంత రాజీ పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సోలార్‌ సెల్స్‌ 7.6 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. చౌకగా లభించే వీటిని భవనాలపై కప్పేసి విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే చిన్న ఉదాహరణ చూద్దాం.. న్యూయార్క్‌లో వన్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ అనే ఓ భారీ భవనముంది. ఆ ఒక్క భవనాన్ని ఎన్‌టీయూ శాస్త్రవేత్తలు తయారు చేసిన పెరోవ్‌ స్కైట్‌ సోలార్‌ సెల్స్‌ తో కప్పేస్తే వందల గంటల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చని తెలిసింది. అంత విద్యుత్తుతో న్యూయార్క్‌లో 40 శాతం ఇళ్ళ అవసరాలు తీర్చవచ్చని అంచనా. perovskite సోలార్‌ సెల్స్‌తో ఎన్‌టీయూ శాస్త్రవేత్తలు సరికొత్త అద్భుతాన్ని సృష్టించినప్పటికీ వీటిని విస్తృత స్థాయిలో వాడే విషయంలో కొన్ని సవాళ్లు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అవి ఎంతకాలం మన్నుతాయి అన్నది. సిలికాన్‌ సోలార్‌ సెల్స్‌ సగటు ఆయుష్షు 25 ఏళ్లు. అయితే వేడి, అతినీలలోహిత కిరణాలను perovskite సెల్స్‌ తట్టుకోవడం కష్టం. అయితే వాహనాల పైకప్పులపై వీటిని వాడటం ద్వారా బ్యాటరీలను నిత్యం ఛార్జ్‌ చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్‌ గ్లాసెస్ పదే పదే ఛార్జ్‌ చేసుకునే అవసరం తప్పుతుంది. ప్రస్తుతం ఈ సోలార్‌ సెల్స్‌పై ఎన్‌టీయూ పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కంపెనీలతో చర్చలూ జరుపుతోంది. అన్నీ సవ్యంగా జరిగితే కొన్నేళ్లలోనే ఇవి మన ఇంటి కిటికీలపైకి చేరవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

23 ఏళ్ల పోరాటం.. రూ.85 కోట్ల భరణం విడాకుల కేసులో ట్విస్ట్‌

బైక్‌ ట్యాక్సీ రైడర్‌గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!

రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా!

తెలంగాణకు చల్లటి కబురు.. ఏపీలో ఎండలు, వానలు!

Follow Us