చెరువుపై పడ్డ ఊరు.. మొత్తం ఊడ్చేశారుగా
మహబూబాబాద్ జిల్లాలో మృగశిర కార్తె సందర్భంగా చేపల కోసం వందలాది మంది గ్రామస్తులు చెరువులోకి దిగి చేపలను పట్టుకెళ్లారు. ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకుని చేపల పెంపకం చేస్తున్న మత్స్యకారులు లక్షల రూపాయల నష్టాన్ని చవిచూశారు. గ్రామస్తుల ఉత్సాహం ఒకవైపు కనిపించగా, మత్స్యకారుల శ్రమ మరోవైపు నీరుగారిన ఘటన చర్చనీయాంశమైంది.
చెరువు లూటీ. ఔను మీరు విన్నది నిజమే. చెరువునే లూటీ చేశారు. లూటీ అంటే నీళ్లను దోచుకోవడం కాదు. చెరువులోని చేపలను దోచుకోవడం. ఊరు ఊరంతా చెరువుపై పడటంతో ఆ ప్రాంతం కాస్తా జాతరను తలపించింది. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం గోపాతండా శివారులోని ‘బంధంకుంట’ చెరువు శనివారం ఈ విచిత్ర ఘట్టానికి వేదికైంది. సోమవారం మృగశిర కార్తె కావడంతో.. ఎలాగైనా ఈ పండగకు చేపల కూర వండుకోవాలనే ఆత్రుతతో వందలాది మంది గ్రామస్తులు ఒక్కసారిగా చెరువులోకి దిగిపోయారు. వలలు ఉన్నవారు వలలతో, లేనివారు చీరలు, లుంగీలతో దొరికిన కాడికి చేపలను పట్టుకుని పండగకు రెడీ అయిపోయారు. గ్రామస్తులంతా చేపలు దొరికాయనే ఆనందంలో ఉంటే, స్థానిక మత్స్యకారులు మాత్రం లబోదిబోమంటున్నారు. ఉప్పరగూడెం గ్రామానికి చెందిన మత్స్యకారులు ఈ బంధంకుంట చెరువును ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నారు. అప్పులు తెచ్చి మరీ చేప పిల్లలను వేసి పెంచారు. తీరా చేతికొచ్చే సమయానికి గ్రామస్తులు సామూహికంగా వచ్చి చేపలన్నింటినీ పట్టుకుపోవడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ లూటీ కారణంగా తమకు దాదాపు లక్షన్నర రూపాయల మేర నష్టం వాటిల్లిందని, కళ్లెదుటే తమ శ్రమ దోపిడీకి గురైందని మత్స్యకారులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృగశిర ఉత్సాహం ఒకరిదైతే.. ఆ ఉత్సాహం మరొకరి జీవితాల్లో విషాదం నింపినట్లయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘అణు చెత్త’ను తొలిసారిగా సమాధి చేస్తున్న ఫిన్లాండ్
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. ఈ టెక్నాలజీ వస్తే.. అందరికీ జీరో బిల్లులే
23 ఏళ్ల పోరాటం.. రూ.85 కోట్ల భరణం విడాకుల కేసులో ట్విస్ట్
బైక్ ట్యాక్సీ రైడర్‌గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా!
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. అందరికీ జీరో బిల్లులే
బైక్ ట్యాక్సీ రైడర్‌గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా
పరుపులతో ప్రాణాలు కాపాడిన హీరోలు!
కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్
దారుణం.. చిన్నారి కాలి ఎముకను విరగ్గొట్టిన డాక్టర్.. కారణం ఇదే
ఐఆర్సీటీసీ బిగ్ ఆపరేషన్.. 3 కోట్ల అకౌంట్లు బ్లాక్

