AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమ్మీద నూకలుండటం అంటే ఇదే.. కారు ముక్కలైనా సేఫ్‌గా బయటపడ్డ నలుగురు

భూమ్మీద నూకలుండటం అంటే ఇదే.. కారు ముక్కలైనా సేఫ్‌గా బయటపడ్డ నలుగురు

Phani CH
|

Updated on: Jun 08, 2026 | 3:29 PM

Share

మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ, అందులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతివేగంగా వెళ్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అదృష్టం అంటే వీరిదేనేమో.. కారు ముక్కలు ముక్కలైనా, అందులోని నలుగురు యువకులు మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా, తలోడా పట్టణంలో జరిగిన ఈ నమ్మశక్యం కాని రోడ్డు ప్రమాదం స్థానికులను నిర్ఘాంతపరిచింది. కొద్దిరోజుల క్రితం కొనుగోలు చేసిన ఒక పాత కారును నలుగురు యువకులు కలిసి టెస్ట్ డ్రైవ్ చేయడానికి రోడ్డుపైకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కారు అతివేగంగా వెళ్తుండగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్ ఎంత బలంగా ఉందంటే.. కారు ఇంజిన్ బాడీ నుంచి విడిపోయి దాదాపు 50 అడుగుల దూరంలో పడిపోయింది. ఆ తర్వాత కారు గాల్లో రెండు మూడు సార్లు పల్టీలు కొడుతూ, సమీపంలోని ఒక నిర్మాణ స్థలంలో ఉన్న ఇనుప రాడ్లు, శిథిలాల మధ్య పడి పూర్తిగా ధ్వంసమైంది. కారు పరిస్థితి చూసిన వారంతా లోపల ఉన్నవారు బతికే ఛాన్స్ లేదనుకున్నారు. కానీ అద్భుతం జరిగినట్లుగా, కారులో ఉన్న నలుగురు యువకులూ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలన్నీ అక్కడి సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందేభారత్‌కు తప్పిన పెను ప్రమాదం!

తెలంగాణ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. మారిన స్కూల్‌ రీ ఓపెనింగ్‌ డేట్‌

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

కన్నవారిని గెంటేసిన కొడుకు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ!

Follow Us