తెలంగాణ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. మారిన స్కూల్ రీ ఓపెనింగ్ డేట్
తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాలల పునఃప్రారంభ తేదీని ప్రభుత్వం మార్చింది. ముందుగా నిర్ణయించిన జూన్ 12కు బదులుగా జూన్ 15న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. విద్యార్థులు కోల్పోయే పనిదినాలను భర్తీ చేసేందుకు జూలై 11 రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా నిర్ణయించిన తేదీని మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూన్ 12వ తేదీన కాకుండా జూన్ 15వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి వేసవి సెలవుల తర్వాత జూన్ 12న పాఠశాలలను తిరిగి తెరవాలని విద్యాశాఖ భావించింది. అయితే ఆ తర్వాతి రోజుల్లో అంటే జూన్ 13న రెండో శనివారం, జూన్ 14న ఆదివారం వచ్చాయి. కేవలం ఒక్క రోజు అంటే జూన్ 12న స్కూళ్ళు తెరిచి, ఆ వెంటనే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నుండి ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు అందాయి. ఈ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం, విద్యార్థుల సౌకర్యార్థం రీఓపెనింగ్ తేదీని జూన్ 15 సోమవారంకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. పాఠశాలల పునఃప్రారంభం ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు కోల్పోయే విద్యా సమయాన్ని మరియు నిర్దేశిత పనిదినాలను భర్తీ చేసేందుకు విద్యాశాఖ ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ 2026-27 ప్రకారం పనిదినాల నియమాలను పాటించేందుకు గానూ.. వచ్చే నెల జూలై 11, 2026 న వచ్చే రెండో శనివారాన్ని సాధారణ పనిదినగా మార్చారు. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. ఈ నూతన ఆదేశాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు అలాగే అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని పాఠశాలలకు చేరవేసి, తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆదేశించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. క్లారిటీ ఇచ్చిన నటుడు!
కన్నవారిని గెంటేసిన కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ!
కన్నవారిని గెంటేసిన కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. అందరికీ జీరో బిల్లులే
బైక్ ట్యాక్సీ రైడర్‌గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా
పరుపులతో ప్రాణాలు కాపాడిన హీరోలు!
కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్

