కన్నవారిని గెంటేసిన కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
వృద్ధాప్యంలో భరోసాగా ఉంటాడని ఆస్తులన్నీ కొడుకుకు రాసిచ్చిన దంపతులను, అదే కొడుకు ఐదేళ్లుగా ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. న్యాయం కోసం అధికారులను ఆశ్రయించిన వృద్ధ దంపతులకు ‘సీనియర్ సిటిజన్స్ యాక్ట్-2007’ కింద ఉపశమనం లభించింది. అధికారులు ఆస్తి బదిలీని రద్దు చేసి, ఇంటిని తిరిగి వారికి అప్పగించారు. ఈ ఘటన తల్లిదండ్రుల హక్కులపై అవగాహన కల్పిస్తోంది.
వృద్ధాప్యంలో పిల్లలే భరోసా అనుకుని తమకున్న ఆస్తులన్నీ కొడుకులకు రాసిచ్చారు ఆ దంపతులు. కానీ, ఆస్తి చేతికి రాగానే ఆ కన్నప్రేమను మరిచిన చిన్న కొడుకు.. అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను ఐదేళ్లుగా రోడ్డుపాలుచేశాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఇంజం చంద్రకళ, రమణారెడ్డి దంపతులకు ఎదురైన ఈ ఘోర అన్యాయం, చివరికి అధికారుల చొరవతో సుఖాంతమైంది. తమను కాదనుకున్న కొడుకుపై దిక్కుతోచని స్థితిలో ఈ వృద్ధ దంపతులు న్యాయం కోసం అధికారుల తలుపు తట్టారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న అధికారులు ‘సీనియర్ సిటిజన్స్ యాక్ట్ – 2007’ ప్రకారం విచారణ చేపట్టారు. తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను విస్మరించి, వారిని ఇంటినుంచి వెళ్లగొట్టినట్లు నిర్ధారణ కావడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టం ప్రకారం కన్నవారిని నిర్లక్ష్యం చేస్తే ఇచ్చిన ఆస్తి బదిలీని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అదే నిబంధనతో జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు మిర్యాలగూడ ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, పోలీసులు కలిసి చిన్నకొడుకు ఆధీనంలో ఉన్న ఇంటికి తాళాలు తీసి, తిరిగి ఆ వృద్ధ దంపతులకు అప్పగించారు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ తమ సొంత గడపలో అడుగుపెట్టిన ఆ తల్లిదండ్రుల కళ్లు ఆనందబాష్పాలు రాల్చాయి. ఆస్తి తీసుకుని తల్లిదండ్రులను రోడ్డున పడేయడం కేవలం కుటుంబ సమస్య కాదు.. చట్టరీత్యా నేరమని ఈ ఘటన నిరూపించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ!
షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన వంటగ్యాస్ ధర.. ఎంతంటే?
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కస్టమర్లను ముంచేసిన గోల్డ్ అప్రైజర్.. రూ.40 లక్షల బంగారంతో పరార్
కన్నవారిని గెంటేసిన కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. అందరికీ జీరో బిల్లులే
బైక్ ట్యాక్సీ రైడర్‌గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా
పరుపులతో ప్రాణాలు కాపాడిన హీరోలు!
కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్

