కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ!
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇప్పటివరకు 25 లక్షల ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కాగా, డిసెంబర్ నాటికి 75 లక్షల ఇళ్లకు ఈ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత విద్యుత్ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పై ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ లభిస్తుందని స్పష్టం చేశారు. రాబోయే డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 75 లక్షల ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 25 లక్షల ఇళ్లకు వీటిని విజయవంతంగా బిగించామని వెల్లడించారు. మొత్తం కోటి ఇళ్లకు ఈ సదుపాయం కల్పించేలా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక పథకం కోసం కేంద్రం రూ. 75,000 కోట్లు కేటాయించింది. ఈ స్కీమ్ కింద ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ కల్పిస్తోంది. 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్రం 60 శాతం వరకు రాయితీ సౌకర్యం కల్పిస్తుండగా.. 2 నుంచి 3 కిలోవాట్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే 40 శాతం సబ్సిడీ ఇస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీనివల్ల ప్రజలకు కరెంట్ బిల్లుల భారం పూర్తిగా తప్పనుంది. పేద, మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. గ్రూప్ హౌసింగ్ సొసైటీ, రెసిడెన్షియల్ వినియోగదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. pmsuryaghar.gov.in పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్, ఈమెయిల్, కనెక్షన్ నెంబర్ ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైనవారు దరఖాస్తు చేసుకుని ఈ పథకం ద్వారా లబ్ది పొందాలని ప్రభుత్వం చెబుతోంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో మిగిలిన కరెంట్‌ను డిస్కంలకు విక్రయించుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన వంటగ్యాస్ ధర.. ఎంతంటే?
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కస్టమర్లను ముంచేసిన గోల్డ్ అప్రైజర్.. రూ.40 లక్షల బంగారంతో పరార్
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. అందరికీ జీరో బిల్లులే
బైక్ ట్యాక్సీ రైడర్‌గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా
పరుపులతో ప్రాణాలు కాపాడిన హీరోలు!
కల్లాల్లో ధాన్యం బస్తాలు కొట్టేస్తున్న బీటెక్ స్టూడెంట్స్
దారుణం.. చిన్నారి కాలి ఎముకను విరగ్గొట్టిన డాక్టర్.. కారణం ఇదే

