కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరులో భార్య మౌనిక మరణించిన 20 రోజుల వ్యవధిలోనే భర్త సందీప్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అదనపు కట్నం వేధింపుల కారణంగా మౌనిక జూలై 16న ప్రాణాలు తీసుకోగా, ఆమె మరణాన్ని తట్టుకోలేక సందీప్ కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ దారుణ ఘటనతో ముగ్గురు పసిపిల్లలు అనాథలయ్యారు.