అల్లం కేవలం రుచికి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కండరాల, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యలను దూరం చేస్తుంది. అల్లం రక్త ప్రసరణను మెరుగుపరిచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది.