AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పొలం పక్కన కాలువ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూసిన రైతులకు గుండెలు గుభేల్.. వీడియో చూడండి..

పంట కాలువ నుండి మనిషి ఈల వేసినట్టు వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లిన రైతులకు అక్కడ గడ్డి కదులుతూ కనిపించింది. ఇంకాస్త నిశితంగా చూడగా గుండె ఒక్కసారిగా గుభేల్‌మంది. ప్రాణభయంతో గట్టుపైకి పరుగులు తీశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆదివారం మధ్యాహ్నం వెలుగుచూసిన ఈ షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Andhra Pradesh: పొలం పక్కన కాలువ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూసిన రైతులకు గుండెలు గుభేల్.. వీడియో చూడండి..
Massive 13 Foot Python Caught In Srikakulam 1
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Jun 09, 2026 | 8:16 AM

Share

మధ్యాహ్నం 12 గంటల సమయం.. ఆ గ్రామంలోని రైతులు పనుల్లో ఉన్నారు. ఇంతలో సమీప పంట కాలువలో నుండి వింత శబ్దాలు వస్తున్నాయి. మొదట వాటిని లైట్ తీసుకున్నప్పటికీ.. మనిషి ఈల వేసినట్టుగా శబ్దం ఉండటంతో అక్కడ ఉన్నవారికి కొంత అనుమానం వచ్చింది. ఏంటా శబ్దం అని కాలువ దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ ఉన్న గడ్డి నెమ్మదిగా కదులుతోంది. మరింత పరిశీలనగా చూసేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అక్కడి వారంతా. దాంతో గట్టు పైకి పరుగులు తీశారు. ఇంతకీ వారు అంతగా పరుగులు పెట్టడానికి కారణం ఎంటా అంటే ఆ కాలువలో ఉన్నది భారీ కొండ చిలువ. శ్రీకాకుళం జిల్లా పలాసలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. పంట కాలువలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న స్థానిక రైతులకు అది దర్శనమిచ్చింది. కొండ చిలువను చూసిన స్థానికులు ,రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంత భారీ కొండ చిలువను తామేప్పుడు చూడలేదని ఆశ్చర్య పోయారు.

స్థానికులు ద్వారా సమాచారమందుకున్న పలాస ఫారెస్ట్ రేంజర్ మురళి కృష్ణం నాయుడు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే స్నేక్ క్యాచర్‌ను రప్పించి రంగంలోకి దింపారు. ఎట్టకేలకు ఆ భారీ కొండ చిలువను చాలా చాకచక్యంగా పట్టుకొని బంధించారు స్నేక్ క్యాచర్. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సమీప కొండల్లోగల అటవీప్రాంతంలో కొండచిలువను విడిచిపెట్టారు. సుమారు 13 అడుగుల పొడవు ఉంది కొండచిలువ. ఇది మహేంద్ర గిరి కొండలనుండి వచ్చి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ట్టకేలకు పట్టుబడిన ఆ కొండచిలువను ఎవరికీ హాని కలగకుండా సమీప కొండల్లోని దట్టమైన అటవీప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో చూడండి

Follow Us