AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు 5 పండ్లు తింటున్నారా? గుండె ఆరోగ్యంపై శాస్త్రవేత్తల సరికొత్త హెచ్చరిక!

సాధారణంగా ప్రతిరోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. కేవలం ఏదో ఒక ఐదు రకాల పండ్లు తినేస్తే సరిపోదని, గుండె పదిలంగా ఉండాలంటే ప్రత్యేకమైన పోషకాలు ఉన్న పండ్లనే ఎంచుకోవాలని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. గుండెను కాపాడుకోవడానికి రోజుకు కనీసం 500mg ఫ్లేవనాల్స్ అవసరం. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి, వాపులను తగ్గిస్తాయి. అలాంటి ఫ్రూట్స్‌ ఏవి..?

రోజుకు 5 పండ్లు తింటున్నారా? గుండె ఆరోగ్యంపై శాస్త్రవేత్తల సరికొత్త హెచ్చరిక!
Best Fruits For Heart HealthImage Credit source: freepik
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jun 09, 2026 | 8:11 AM

Share

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినాలని డాక్టర్లు చెబుతుంటారు. అయితే, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు శాస్త్రవేత్తలు. కేవలం ఏదో ఒక ఐదు రకాల పండ్లు తినేస్తే సరిపోదని, గుండె పదిలంగా ఉండాలంటే ప్రత్యేకమైన పోషకాలు ఉన్న పండ్లనే ఎంచుకోవాలని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మనం తినే పండ్లలో ఫ్లేవనాల్స్ అనే కీలక యాంటీఆక్సిడెంట్స్ ఉండటం చాలా ముఖ్యం. అమెరికా, యూకేకి చెందిన సుమారు 30,000 మందిపై జరిపిన పరిశోధనలో ఒక షాకింగ్ విషయం వెలుగుచూసింది. ప్రతిరోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినే వారిలో కూడా గుండెకు అవసరమైన ఈ ఫ్లేవనాల్స్ పోషకాలు చాలా తక్కువగా ఉన్నట్లు ఫుడ్ అండ్ ఫంక్షన్ జర్నల్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఐదుగురిలో కేవలం ఒక్కరు మాత్రమే శరీరానికి కావలసినంత మోతాదులో ఫ్లేవనాల్స్ పొందుతున్నారట.

ఇవి ఒక రకమైన శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తాయి. రక్తనాళాల స్థితిస్థాపకతను పెంచి, శరీరంలో వాపులను తగ్గిస్తాయి. గుండె పదిలంగా ఉండాలంటే రోజుకు కనీసం 500 మిల్లీగ్రాముల ఫ్లేవనాల్స్ శరీరానికి అందాలి. గుండెను కాపాడే ఆ టాప్ 10 ఆహారాలు ఏంటి? రీసెర్చర్ల ప్రకారం.. మనం రెగ్యులర్‌గా తినే డైట్‌లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఫ్లేవనాల్స్ శాతాన్ని అద్భుతంగా పెంచుకోవచ్చు. వాటి పరిమాణాలు, అందులో ఉండే ఫ్లేవనాల్స్ వివరాలు ఇక్కడ చూడండి:

1. ప్లమ్స్ ..ఒక 500 గ్రాముల ప్యాకెట్ తింటే.. ఏకంగా 450mg ఫ్లేవనాల్స్ లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

2. క్రాన్‌బెర్రీస్ 250 గ్రాముల్లో.. 300mg లభిస్తాయి.

3. బ్లాక్‌బెర్రీస్ 200 గ్రాముల్లో.. 250mg ఉంటాయి.

4. గ్రీన్ టీ ఒక కప్పు (250ml) తాగితే చాలు.. 200mg అందుతాయి.

5. బ్రాడ్ బీన్స్ చిన్న గుప్పెడు (80g) తింటే.. 140mg లభిస్తాయి.

6. చెర్రీస్ 400 గ్రాముల్లో.. 130mg ఉంటాయి.

7. ఆపిల్ తొక్క తీయకుండా ఒక మీడియం సైజ్ ఆపిల్ తింటే.. 110mg లభిస్తాయి.

8. స్ట్రాబెర్రీస్ 200 గ్రాముల్లో.. 90mg ఉంటాయి.

9. బ్లూబెర్రీస్ 150 గ్రాముల్లో.. 80mg లభిస్తాయి.

10. పింటో బీన్స్ రెండు టేబుల్ స్పూన్లు తింటే.. 70mg అందుతాయి.

చాలామంది డార్క్ చాక్లెట్ గుండెకు మంచిదని నమ్ముతారు. ఎందుకంటే ఇందులో కోకో ఎక్కువగా ఉండటం వల్ల ఫ్లేవనాల్స్ దొరుకుతాయి. అయితే, మార్కెట్లో దొరికే కమర్షియల్ చాక్లెట్లలో వీటి పరిమాణం చాలా తేడాగా ఉంటుంది. రెండు, మూడు ముక్కల డార్క్ చాక్లెట్ తింటే కేవలం 22 నుంచి 73 మిల్లీగ్రాముల ఫ్లేవనాల్స్ మాత్రమే లభిస్తాయి. అదే మిల్క్ చాక్లెట్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది. కాబట్టి చాక్లెట్ల కంటే పండ్ల ద్వారా వీటిని పొందడమే బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.

రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గుంటర్ కున్లే స్పందిస్తూ.. రోజుకు ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినాలనే నియమం మంచిదే. కానీ అందులో ఏవి తింటున్నామనేది మరింత ముఖ్యం. ఒక్కో పండులో ఒక్కో రకమైన న్యూట్రిషన్ విలువలు ఉంటాయి అని తెలిపారు.

అయితే, బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ మరియు కొందరు హార్ట్ నిపుణులు మాత్రం కేవలం ఫ్లేవనాల్స్ పెంచేస్తేనే గుండె జబ్బులు రావని నమ్మలేమని, దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఒక్కొక్కరి శరీరంలో ఉండే గట్ బ్యాక్టీరియా ఆధారంగా ఈ పోషకాల గ్రహణ శక్తి మారుతుందని, కాబట్టి అన్ని రకాల పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడమే ఎప్పుడూ సురక్షితమని సూచిస్తున్నారు.

పైన పేర్కొన్న సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డైట్‌లో మార్పులు చేసే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!