యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన సూర్యాపేట డిపో ఎలక్ట్రిక్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.