AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ అవసరం లేదు.. డీజిల్‌తో పనిచేసే స్టవ్.. మీ క్రియేటివిటీకి దండం పెట్టాల్సిందే సామీ..

గ్యాస్ కొరతతో హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ పూర్తిగా మూతపడ్డాయి. ఇక మరికొన్ని హోటళ్లు మెనూను తగ్గించడంతో పాటు ధరలను పెంచాయి. అయితే గ్యాస్ కొరత వేళ ఓ హోటల్ యజమాని వినూత్న ప్రయోగం చేశాడు. డీజిల్‌తో నడిచే స్టవ్ తయారుచేశాడు.

గ్యాస్ అవసరం లేదు.. డీజిల్‌తో పనిచేసే స్టవ్.. మీ క్రియేటివిటీకి దండం పెట్టాల్సిందే సామీ..
Disel
G Sampath Kumar
| Edited By: |

Updated on: Apr 03, 2026 | 7:32 PM

Share

సిరిసిల్లలో ఓ హోటల్ నిర్వాహకుడు వినూత్న ప్రయోగంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.  వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో హోటల్ నిర్వహణ కష్టంగా మారిన నేపథ్యంలో సిరిసిల్లకు చెందిన మహేష్ అనే హోటల్ యజమాని డీజిల్‌తో పనిచేసే ప్రత్యేక స్టవ్  తయారు చేశారు. చిన్న విద్యుత్ మోటర్ సహాయంతో డీజిల్‌ను పొయ్యి దగ్గరకు పంపించి, అక్కడ మంట వెలిగే విధంగా ఈ స్టవ్ రూపొందించారు.  అవసరాన్ని బట్టి మంటను పెంచడం, తగ్గించడం కూడా వీలవుతుంది. ఈ స్టవ్‌లో ఒక్కసారి డీజిల్ నింపితే గంట నుంచి రెండు గంటల వరకు నిరంతరంగా పనిచేస్తుందని మహేష్ తెలిపారు. గ్యాస్ సిలిండర్లతో పోలిస్తే ఖర్చు సగానికి తగ్గిందని ఆయన చెబుతున్నారు.

తయారీకి రూ.10 వేల ఖర్చు

ఈ యంత్రాన్ని తయారు చేయడానికి సుమారు పది వేల రూపాయల ఖర్చు కాగా.. నాలుగు రోజుల పాటు శ్రమించి రూపొందించినట్లు వెల్లడించారు. మహేష్ చేసిన ఈ వినూత్న ప్రయోగాన్ని చూసి మరికొంతమంది హోటల్ నిర్వాహకులు కూడా ఇలాంటి స్టౌలను తయారు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందిస్తున్న ఈ కొత్త ఆవిష్కరణ స్థానికంగా చర్చకు దారి తీసింది. తమకు కూడా ఇలాంటి స్టావ్‌లు అవసరమని హోటల్ యజమానులు చెబుతున్నారు. చాలామంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్లిపోతున్నారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్
త్వరలో అరుదైన గ్రహాల కలయిక.. అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి
త్వరలో అరుదైన గ్రహాల కలయిక.. అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి
పసివాడి ప్రాణం విలన్ గుర్తున్నాడా.?
పసివాడి ప్రాణం విలన్ గుర్తున్నాడా.?
ఇవాళే OTTలోకి వచ్చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్..IMDBలో 7.1 రేటింగ్
ఇవాళే OTTలోకి వచ్చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్..IMDBలో 7.1 రేటింగ్
గుండు చేయించుకొని ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలికి ఊహించని తిప్పలు
గుండు చేయించుకొని ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలికి ఊహించని తిప్పలు
రైతన్నలు ఇలాంటి పని అస్సలు చేయొద్దు.. జర్రుంటే ఏం జరిగేదో తెలుసా.
రైతన్నలు ఇలాంటి పని అస్సలు చేయొద్దు.. జర్రుంటే ఏం జరిగేదో తెలుసా.
పె.. ద్ద.. ప్లానే.. నడి రోడ్డుపై మకాం వేసి విషనాగులు.. వీడియో
పె.. ద్ద.. ప్లానే.. నడి రోడ్డుపై మకాం వేసి విషనాగులు.. వీడియో
కేంద్రం షాకింగ్ నిర్ణయం.. NEET రీ-ఎగ్జామ్‌కు ఎయిర్‌ఫోర్స్ సేవలు?
కేంద్రం షాకింగ్ నిర్ణయం.. NEET రీ-ఎగ్జామ్‌కు ఎయిర్‌ఫోర్స్ సేవలు?
జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ రోజు చేసే పూజలకు కోటిరెట్లు ఫలితం.. తప్పక..
జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ రోజు చేసే పూజలకు కోటిరెట్లు ఫలితం.. తప్పక..
వంకాయ ప్రియులకు బిగ్ అలర్ట్.. ఈ హెచ్చరిక మీ కోసమే..
వంకాయ ప్రియులకు బిగ్ అలర్ట్.. ఈ హెచ్చరిక మీ కోసమే..