AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ పూల పండుగలో అత్తింటివారి ఆప్యాయత…కొత్త కోడలికి గుర్తుండిపోయే కానుక

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రకృతిని దైవంగా భావించి పూలను అందంగా పేర్చి, ఆటపాటలతో గౌరమ్మను పూజించడం ఈ పండుగ ప్రత్యేకత. అయితే జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఓ కుటుంబం సంప్రదాయానికి ఆధునిక ఆలోచనలను జోడించి బతుకమ్మ పండుగను వినూత్నంగా నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్తగా పెళ్లైన కోడలిపై ఉన్న ప్రేమానురాగాలను చాటుకుంటూ ఏకంగా 25 రకాల బతుకమ్మలను తయారు చేసి వాయినంగా అందించారు.

తెలంగాణ పూల పండుగలో అత్తింటివారి ఆప్యాయత...కొత్త కోడలికి గుర్తుండిపోయే కానుక
25 Types Of Bathukamma
G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 13, 2026 | 6:47 PM

Share

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. పూలను పేర్చి బతుకమ్మను అందంగా అలంకరించి, ఆటపాటలతో అమ్మవారిని పూజిస్తారు. అయితే జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓ కుటుంబం బతుకమ్మ పండుగను వినూత్నంగా జరుపుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్తగా పెళ్లైన కోడలికి అత్తింటివారు ఏకంగా 25 రకాల బతుకమ్మలను తయారు చేసి వాయినంగా అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

జగిత్యాల జిల్లా మెట్ పల్లి చైతన్యనగర్‌కు చెందిన పల్లవికి, అగ్గిమల్ల గ్రామానికి చెందిన అరవింద్‌తో ఐదు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత వచ్చిన తొలి బతుకమ్మ పండుగ కావడంతో పల్లవి అత్తింటివారు ఈ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పూలతో పాటు వివిధ రకాల వస్తువులతో 25 రకాల బతుకమ్మలను అందంగా రూపొందించారు.

పూలు, బత్తాయి, కాగితం, వెండి, నాణేలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గాజులు, మెహందీ, ముత్యాలు, పసుపు, కుంకుమ తదితర వస్తువులతో ఒక్కో బతుకమ్మను ఒక్కో ప్రత్యేకతతో తయారు చేశారు. సంప్రదాయానికి ఆధునిక ఆలోచనలను జోడిస్తూ రూపొందించిన ఈ బతుకమ్మలు వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

నూతన దంపతులకు కొత్త బట్టలు పెట్టి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వాయినం అందించారు. తొలి బతుకమ్మ పండుగను జీవితాంతం గుర్తుండిపోయేలా నిర్వహించాలన్న అత్తింటివారి ఆప్యాయత ఈ వేడుకలో ప్రతిబింబించింది. సాధారణంగా పూలతో బతుకమ్మలను తయారు చేయడం ఆనవాయితీ కాగా, వివిధ వస్తువులతో 25 రకాల బతుకమ్మలను రూపొందించడం విశేషంగా నిలిచింది.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, కుటుంబ బంధాలకు బతుకమ్మ పండుగ అద్దం పడుతుందని ఈ వేడుక మరోసారి చాటిచెప్పింది. పండుగ అంటే కేవలం ఆచారం మాత్రమే కాదు.. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను పంచుకునే సందర్భమని మెట్పల్లిలోని ఈ వినూత్న బతుకమ్మ వేడుక చాటిచెప్పింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రూ.1.5 లక్షలు అడిగిన లాయర్.. ఏఐ సాయంతో రూ.2,432తో పని పూర్తి!
రూ.1.5 లక్షలు అడిగిన లాయర్.. ఏఐ సాయంతో రూ.2,432తో పని పూర్తి!
పీనట్ బట్టర్ ఆరోగ్య లాభాలు.. ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా?
పీనట్ బట్టర్ ఆరోగ్య లాభాలు.. ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా?
క్యాబ్ ఖర్చులు తగ్గించుకోండి.. తక్కువ ధరకే పుష్పక్ ఏసీ బస్సులో..
క్యాబ్ ఖర్చులు తగ్గించుకోండి.. తక్కువ ధరకే పుష్పక్ ఏసీ బస్సులో..
భారత్‌లో కార్బన్ గ్రాండ్ కంబ్యాక్..తక్కువ ధరకే రెండు కొత్త ఫోన్లు
భారత్‌లో కార్బన్ గ్రాండ్ కంబ్యాక్..తక్కువ ధరకే రెండు కొత్త ఫోన్లు
రోడ్డెక్కిన రాజకీయం.. చితికిపోతున్న వ్యాపారం..
రోడ్డెక్కిన రాజకీయం.. చితికిపోతున్న వ్యాపారం..
 దీపావళికి ఈ కలర్స్ ట్రై చేయండి.. మీ డ్రెస్సింగ్ స్టైల్ కి ఫిదా
 దీపావళికి ఈ కలర్స్ ట్రై చేయండి.. మీ డ్రెస్సింగ్ స్టైల్ కి ఫిదా
వాటికి అడ్డుకట్ట వేయండి.. అమిత్ షాకు చిరంజీవి రిక్వెస్ట్
వాటికి అడ్డుకట్ట వేయండి.. అమిత్ షాకు చిరంజీవి రిక్వెస్ట్
వాస్తు ప్రకారం జాడే ప్లాంట్ ఎక్కడ ఉంచాలి? సిరిసంపదలు కలగాలంటే ఇలా
వాస్తు ప్రకారం జాడే ప్లాంట్ ఎక్కడ ఉంచాలి? సిరిసంపదలు కలగాలంటే ఇలా
రోజుకు 5 క్యాన్ల కోక్.. బర్గర్లు.. వారెన్ బఫెట్ లైఫ్ స్టైల్ ఇదే
రోజుకు 5 క్యాన్ల కోక్.. బర్గర్లు.. వారెన్ బఫెట్ లైఫ్ స్టైల్ ఇదే
టమాటా మొక్క పూత రాలిపోతుందా?.. ఈ చిన్న చిట్కా పాటించండి
టమాటా మొక్క పూత రాలిపోతుందా?.. ఈ చిన్న చిట్కా పాటించండి