AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సికింద్రాబాద్ టు లింగంపల్లి.. ట్రాఫిక్ లేకుండా జస్ట్ 30 నిమిషాల్లో జర్నీ

సికింద్రాబాద్ నుంచి లింగంపల్లికి 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఎక్స్‌ప్రెస్, సబర్బన్ ద్వారా సులువుగా చేసుకోవచ్చు. బస్సులు, సొంత వాహనాల ద్వారా వెళ్లాలంటే గంటన్నర సమయం పడుతుంది. అదే ఎక్స్‌ప్రెస్ ద్వారా అరగంటలోనే చేరుకోవచ్చు. ఛార్జీ కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

సికింద్రాబాద్ టు లింగంపల్లి.. ట్రాఫిక్ లేకుండా జస్ట్ 30 నిమిషాల్లో జర్నీ
Hyderabad
Venkatrao Lella
|

Updated on: Nov 23, 2026 | 9:49 AM

Share

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రోజురోజుకి పెరిగిపోతోంది. నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో జీవనోపాధి కోసం వస్తున్నారు. ఇక ఐటీ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు వస్తున్నాయి. ఈ క్రమంలో నగర జనాభా పెరుగుతుండటంతో వాహనాల సంఖ్య కూడా రెట్టింపు అవుతుంది. దీని వల్ల అన్ని రూట్లలో ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతూ వస్తోంది. అయితే ట్రాఫిక్ రద్దీ నుంచి తప్పించుకునేందుకు కొంతమంది సొంత వాహనాలను పక్కన పెట్టి మెట్రో, ఎంఎంటీఎస్ వంటి సర్వీసులను ఎంచుకుంటున్నారు. అలాగే సబర్బన్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా కూడా వేగవంతంగా గమ్యస్థానికి చేరుకునే అవకాశముంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లద్వారా సికింద్రాబాద్ నుంచి లింగంపల్లికి కేవలం 25 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. టికెట్ ధర కూడా రూ.50 ఉంటుంది.

30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు..

సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య బస్సులో ప్రయాణించాలంటే సుమారు గంటన్నర సమయం పడుతుంది. ఇక సొంత వాహనంలో వెళ్లాలన్నా ఇదే సమయం పడుతుంది. ఇక ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటే మరింత సమయం పట్టవచ్చు. అయితే సికింద్రాబాద్ నుంచి లింగంపల్లికి 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎంఎంటీఎస్ రైళ్లు కూడా సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉండగా.. వీటిల్లో ప్రయాణానికి 45 నిమిషాల సమయం పడుతుంది. అయితే ఇంటర్ సిటీ, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సికింద్రాబాద్ నుంచి బయల్దేరి లింగంపల్లికి ఆగుతన్నాయి. ఈ రైళ్ల ద్వారా వెళితే కేవలం రూ.50 ఛార్జీతో 30 నిమిషాల్లోనే సికింద్రాబాద్ నుంచి లింగంపల్లికి చేరుకోవచ్చు. సొంత వాహనం, బస్సుల కంటే ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా వేగవంతంగా చేరుకోవచ్చు. చాలా ట్రైన్లకు లింగంపల్లిలో స్టాపులు కల్పించారు. ఈ రైళ్లను వినియోగించుకుంటే ట్రాఫిక్ ఇబ్బందులను ప్రయాణికులు తప్పించుకోవచ్చు.

తగ్గనున్న ప్రయాణ సమయం

ఇక ఘట్‌కేసర్, చర్లపల్లి నుంచి లింగంపల్లికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సులు, సొంత వాహనాల్లో వెళ్లాలంటే రెండున్నర గంటల సమయం పట్టవచ్చు. కానీ సబర్బన్ లింక్ సర్వీసులు, రైళ్ల ద్వారా వెళితే గంట 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. దీని వల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. తక్కువ ఖర్చుతో గమ్యస్థానానికి చేరుకునే వీలు ఉంటుంది. టికెట్ బుకింగ్ యాప్స్ ద్వారా సులువుగా ఎక్స్‌ప్రెస్, సబర్బన్ రైళ్లలో టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. దీని వల్ల కౌంటర్ల ద్వారా క్యూలైన్లలో నిల్చోవాల్సిన పని తప్పుతుంది. అలాగే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా కూడా టికెట్ పొందవచ్చు.  అయితే రైల్వే స్టేషన్ల నుంచి ఐటీ కారిడార్లకు వెళ్లేలా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కల్పిస్తే మరింత సౌకర్యంతంగా ఉంటుందని ప్రయాణికులు కోరుతున్నారు.

Follow Us