AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakash Raj : క్రైస్తవ సంప్రదాయంలో తల్లి అంత్యక్రియలు.. ట్రోల్స్ పై మండిపడ్డ ప్రకాష్ రాజ్..

టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తల్లి సువర్ణలత ఇటీవల కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు బెంగళూరులో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. అయితే ముందు నుంచి నాస్తికుడినని చెప్పుకునే ప్రకాష్ రాజ్.. తన తల్లి అంత్యక్రియలు చర్చిలో క్రైస్తవ మతపరమైన ఆచారాలు పాటించడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శలు గుప్పించారు.

Prakash Raj : క్రైస్తవ సంప్రదాయంలో తల్లి అంత్యక్రియలు.. ట్రోల్స్ పై మండిపడ్డ ప్రకాష్ రాజ్..
Prakash Raj
Rajitha Chanti
|

Updated on: Apr 02, 2026 | 4:56 PM

Share

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోగా, విలన్ గా, సహయ నటుడిగా ఎన్నో వందల చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన తల్లి సువర్ణలత కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె 86 ఏళ్ల వయసులో సోమవారం ఉదయం తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అదే రోజు సాయంత్రం బెంగుళూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం తన తల్లి అంతిమ సంస్కారాలు నిర్వహించడంపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వచ్చాయి. తనకు దేవుడిపై నమ్మకం లేదని.. తాను నాస్తికుడినని చెప్పుకునే ప్రకాష్ రాజ్ ఇలా ఒక మత ఆచారాల ప్రకారం ఎలా చేశారంటూ నెట్టింట తీవ్ర టోల్స్ వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ ప్రకాష్ రాజ్ తీరుపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఈ ట్రోల్స్ పై ప్రకాష్ రాజ్ స్పందించారు.

ఎక్కువ మంది చదివినవి : RGV : సినిమా చండాలంగా ఉంది.. కుదిరితే ఆపేయ్యమని చెప్పారు.. కానీ.. ఇండస్ట్రీని షేక్ చేసింది.. రామ్ గోపాల్ వర్మ..

ప్రకాష్ రాజ్ తనను తాను నాస్తికుడినని చెప్పుకుంటూ దేవుడిపై తనకు నమ్మకం లేదని చెబుతారు. కానీ తన తల్లి అంత్యక్రియలు మాత్రం క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారు అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ వీడియోను సైతం జత చేశారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ తన తల్లి నమ్మకాలను గౌరవించి అంత్యక్రియలు నిర్వహించానని చెప్పుకొచ్చారు. రాక్షసులకు ఇలాంటివి ఎలా అర్థమవుతాయంటూ రాసుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇండియాలో నిజంగా జరిగిన కథ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

“అవును. నేను దేవుడిని నమ్మను.. కానీ మా అమ్మ తన దేవుడిని నమ్మేది. ఆమె నమ్మకం ప్రకారం ఖననం చేయబడే హక్కును కాదనడానికి నేను ఎవరు? ఇది మనం ఒకరికొకరు ఇచ్చే కనీస గౌరవం. ద్వేషాన్ని రెచ్చగొట్టే రాక్షసులారా, ఇది అర్థం చేసుకుంటారా?” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Meena: ఏంటీ మేడమ్ మీరు.. మీనా ఎంతవరకు చదువుకుందో తెలుసా.. ? అసలు విషయం చెప్పిన హీరోయిన్.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ సినిమా ఒక నిశబ్ధ విప్లవం.. తెలుగులోనే వచ్చిన గొప్ప చిత్రం.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల