రామాయణం కోసం ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే..
Rajeev
2 April 2026
బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా రామాయణం. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో రాముడిగా స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. రాముడిగా నటించడానికి రణబీర్ రూ. 75కోట్లు పారితోషం తీసుకున్నట్టు తెలుస్తుంది.
సీతగా అందాల తార సాయి పల్లవి నటిస్తుంది. కాగా ఈ సినిమా కోసం సాయి పల్లవి రూ. 5కోట్లు తీసుకుంటుందని తెలుస్తుంది.
కాగా రామాయణం సినిమాలో రావణుడిగా స్టార్ హీరో యశ్ నటిస్తున్నాడు. అలాగే సహా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. యశ్ రూ. 50కోట్లు తీసుకుంటున్నాడట.
కాగా రావణుడి భార్య మండోదరిగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుందని తెలుస్తుంది. కాజల్ ఈ సినిమా కోసం రూ.1కోటి అందుకుంటుందట.
అలాగే రావణుడి సోదరి శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందని తెలుస్తుంది. కాగా ఈ అమ్మడు రామాయణం సినిమా కోసం రూ. 1.50 కోట్లు అందుకుంటుందని టాక్.
అలాగే హనుమంతుడిగా సన్నీ డియోల్ రూ.రూ.20 కోట్లు, లక్ష్మణుడిగా రవి దుబే రూ.4 కోట్లు అంటుకుంటున్నారని తెలుస్తుంది.