అందంతో కుర్రాళ్ల గుండెలకు గాలులు వేస్తున్న ఆషిక 

Rajeev 

6 February 2026

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్.

తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. 

ఆతర్వాత కింగ్ నాగార్జున నటించిన నా సామీ రంగ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 

ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఆషిక రంగనాథ్.. ఇక ఈ సినిమా తర్వాత రీసెంట్ గా రవితేజ సినిమాలో మెరిసింది. 

రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో మెరిసింది. ఈ సినిమాలో గ్లామర్ లుక్ లో కనిపించింది. 

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ తన అందాలతో ఈ సినిమాలో దుమ్మురేపింది 

ఇక ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది ఆషిక రంగనాథ్. సోషల్ మీడియాలోనూ అదరగొడుతుంది ఈ చిన్నది.