ఆపరేషన్ జాక్ సక్సెసయింది. తూర్పు గోదావరి జిల్లా కూర్మాపురంలో పులిని విజయవంతంగా బంధించారు. పాక నుంచి బయటకు వచ్చిన పులి.. పక్కనే వున్న చెరువువైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించింది. ఫ్లడ్ లైట్ వెలుతురులో గురి చూసి మత్తు ఇంజక్షన్‌ను షూట్ చేశారు. మగతలో జారుకున్న పులిని బోనులోకి చేర్చారు. పొద్దున్నుంచి పులి గాండ్రింపుతో హడలిపోయిన జనం… పులి పట్టుపడగానే పండగ చేస్కున్నారు. మత్తులో వున్న పులిని బోనులోకి చేరుస్తుండగా సెల్పీల కోసం ఎగపడ్డారు.