- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti These 7 people are considered to be revered it is also a sin to set their feet know the details
Chanakya Niti: ఈ ఏడుగురు అత్యంత పూజ్యనీయులు.. వారిని పాదాలతో తాకితే మహా పాపం..
ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో పూజనీయులుగా పరిగణించబడే ఏడుగురి గురించి పేర్కొన్నాడు. వారిని పాదాలతో తాకితే పాపం తగులుతుందని చెప్పారు. ఆచార్య చాణక్య చెప్పిన ఆ ఏడుగురు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 04, 2022 | 6:30 PM

కొంతమంది కొన్ని పనిని పూర్తి చేయడానికి అబద్ధాలపై ఆధారపడతారు. ఇలా అబద్ధం చెప్పడం ద్వారా.. ఈ రోజు మీ పని ఏదో ఒక విధంగా పూర్తి కావచ్చు. కానీ మీ అబద్ధం దొరికిన రోజు.. మీరు మీమీద విశ్వాసంతో పాటు గౌరవాన్ని కూడా కోల్పోతారు.

ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో పూజనీయులుగా పరిగణించబడే ఏడుగురి గురించి పేర్కొన్నాడు. వారిని పాదాలతో తాకితే పాపం తగులుతుందని చెప్పారు. ఆచార్య చాణక్య చెప్పిన ఆ ఏడుగురు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

మనం చేసే ఏ శుభకార్యమైనా కేవలం బ్రాహ్మణులు మాత్రమే చేస్తారు. ఎవరైనా చనిపోయిన తర్వాత కూడా బ్రాహ్మణులు పూజలు చేస్తే తప్ప వారి ఆత్మకు శాంతి కలగదు. అందుకే బ్రాహ్మణులను పూజనీయులుగా భావిస్తారు. వారిని ఎప్పుడూ అవమానించొద్దు. వారి పాదాలను తాకి ఆశీస్సులు పొందండి.

గురువు నీ భవిష్యత్తుకు మార్గనిర్దేశనం చేస్తాడు. మీకు సరైన మార్గాన్ని చూపుతారు. అలాంటి గురువును ఎప్పుడూ అవమానించకూడదు. వారిని సన్మానించి ఆశీర్వాదం పొందండి. గురువును గౌరవించని వారు జీవితంలో ఎప్పటికీ రాణించలేరు.

కన్య అయిన అమ్మాయిని కూడా దేవతగా భావిస్తారు. అమ్మాయిని ఎప్పుడూ అవమానించవద్దు. ఆమెపై చెడు దృష్టి పెట్టవద్దు. ఇలా చేసేవారికి పాపం తగులుతుంది. ఇంట్లోనే కాదు ప్రతి అమ్మాయిని గౌరవించడం నేర్చుకోండి.

ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం ఇంటి పెద్దలు నేర్పిన సంస్కారం. మీ పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించండి. పెద్దల ఆశీర్వాదం ఉంటే పెద్ద విపత్తులను కూడా అరికట్టవచ్చు. ఇది కుటుంబంలో శ్రేయస్సును తెస్తుంది.

హిందూ మతంలో ఆవును తల్లి అంటారు. ఆవులో 33 వర్గాల దేవతలు నివసిస్తారని ప్రతీతి. ఆవును తన్నితే అది పాపంగా పరిగణించబడుతుంది. ఒకవేళ తెలియక చేసినా వెంటనే క్షమాపణలు చెబితే సరిపోతుంది. ఆవును పూజించండి. ఇది మీ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.

పసిబిడ్డలను కూడా భగవంతుని స్వరూపంగా భావిస్తారు. వారి మనసు చాలా ప్రశాంతమైనది. వారు ఏం చెప్పినా.. ఏం చేసినా నిజాయితీగా ఉంటారు. ఎదుటివారికి హానీ చేయాలనే తలంపు ఉండదు. అలాంటి చంటిపిల్లలను దేవుడిలా భావించి ప్రేమను అందించాలి. వారిని గౌరవించాలి.





























