Viral Video: హార్స్‌ రేసింగ్‌ ట్రాక్‌లోకి దూసుకొచ్చిన మొసలి.. హడలిపోయిన గుర్రం.. చివరకు ఏం జరిగిందంటే..

Viral Video: గుర్రం పరిగెత్తే ట్రాక్ పైకి హఠాత్తుగా ఓ పెద్ద మెుసలి వస్తుంది. దీంతో ఒక్కసారిగా గుర్రం, దాన్ని పట్టుకున్న వ్యక్తి భయపడతారు. మొసలిని చూసి గుర్రం హ్యాండ్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రేసింగ్‌ ట్రాక్‌ దాటి పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది.

Viral Video: హార్స్‌ రేసింగ్‌ ట్రాక్‌లోకి దూసుకొచ్చిన మొసలి.. హడలిపోయిన గుర్రం.. చివరకు ఏం జరిగిందంటే..
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2022 | 11:09 PM

Viral Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఇటీవల జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. పాము, పులి, సింహం, మెుసలి, ఏనుగు తదితర జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాను బాగా షేక్‌ చేస్తోంది. హార్స్‌ రైడింగ్‌ గురించి మనందరికీ బాగానే తెలిసి ఉంటుంది. గుర్రాలకు ప్రత్యేక నంబర్లు కేటాయించి రేస్‌ ట్రాక్‌లో వాటిని దౌడు తీయిస్తారు. వీటిపై బెట్టింగ్స్ కాస్తూ ఉంటారు. గ్యాలరీలోని జనాలందరూ ఈ రేస్‌ను ఆసక్తిగా తిలకిస్తుంటారు. ఈక్రమంలో లూషియానాలో రేస్ ట్రాక్ లో షాకింగ్ ఘటన జరిగింది. గుర్రం పరిగెత్తే ట్రాక్ పైకి హఠాత్తుగా ఓ పెద్ద మెుసలి వస్తుంది. దీంతో ఒక్కసారిగా గుర్రం, దాన్ని పట్టుకున్న వ్యక్తి భయపడతారు. మొసలిని చూసి గుర్రం హ్యాండ్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రేసింగ్‌ ట్రాక్‌ దాటి పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది.

కాసేపటికే ఆ మెుసలి నెమ్మదిగా నడుచుకుంటూ ట్రాక్ దాటుతుంది.10 సెకన్ల నిడివి గల ఈ వీడియో రేసింగ్.కామ్ అనే ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియా నెట్టింట్లో బాగా వైరలవుతోంది. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘గుర్రంతో పాటు మొసలి కూడా కూడా రేస్‌లో పాల్గొనాలని వచ్చిందేమో’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Narayana Murthy: IPO జోక్ కాదన్న నారాయణమూర్తి.. స్టార్టప్‌లు పేద ఇన్వెస్టర్ల గురించి కూడా ఆలోచించాలని వ్యాఖ్య..

T20 Blast: 63 పరుగులకు 9 వికెట్లు.. నిప్పులు చెరుగుతోన్న రాజస్థాన్ ప్లేయర్.. ప్రత్యర్థుల డమాల్..

Namita: వేడుకగా హీరోయిన్‌ సీమంతం.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే