AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Singh : గంభీర్ లోని మరో కోణం.. విషాదంలో ఉన్న రింకూకు కోచ్ ఇచ్చిన భరోసా ఇదే

Gautam Gambhir : టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ తండ్రి చనిపోయిన విషాదంలో ఉన్నప్పటికీ, దేశం కోసం తిరిగి జట్టులోకి చేరిన తీరుకు గంభీర్ ఫిదా అయిపోయారు. వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన టీమ్ టాక్‌లో గంభీర్.. రింకూ సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rinku Singh : గంభీర్ లోని మరో కోణం.. విషాదంలో ఉన్న రింకూకు కోచ్ ఇచ్చిన భరోసా ఇదే
Gauthum Gambhir
Rakesh
|

Updated on: Mar 04, 2026 | 11:29 AM

Share

Rinku Singh : భారత క్రికెట్ జట్టులో గంభీర్ అంటే ఒక కఠినమైన కోచ్ అని, ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారని పేరు. కానీ, టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్ ముందు గౌతమ్ గంభీర్‌లోని అసలైన కోణం బయటపడింది. టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ తండ్రి చనిపోయిన విషాదంలో ఉన్నప్పటికీ, దేశం కోసం తిరిగి జట్టులోకి చేరిన తీరుకు గంభీర్ ఫిదా అయిపోయారు. వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌కు ముందు జరిగిన టీమ్ టాక్‌లో గంభీర్.. రింకూ సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రింకూ సింగ్ తండ్రి గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు. తన తండ్రి అంత్యక్రియలకు హాజరైన మరుసటి రోజే రింకూ తిరిగి జట్టుతో చేరాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత బాధను పక్కన పెట్టి వచ్చిన రింకూను చూసి గంభీర్ ఎమోషనల్ అయ్యారు. “రింకూ.. ఇలాంటి సమయంలో మళ్ళీ జట్టుతో చేరడానికి చాలా గుండె ధైర్యం కావాలి. ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఒంటరివి కావు. ఈ కష్ట సమయంలో ఈ జట్టు మొత్తం నీ వెంటే ఉంది. స్ట్రాంగ్ గా ఉండు” అంటూ గంభీర్ భరోసా ఇచ్చారు. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో ఈ హృదయపూర్వక దృశ్యాలు కనిపించాయి.

కేవలం రింకూకే కాదు, మొత్తం జట్టులో గంభీర్ కొత్త ఉత్సాహాన్ని నింపారు. వెస్టిండీస్‌తో జరిగిన ఆ మ్యాచ్ భారత్‌కు చావోరేవో లాంటిది. ఆ ఒత్తిడి గురించి మాట్లాడుతూ.. “ఒత్తిడి ఉంటుంది, దాన్ని చూసి పారిపోవద్దు.. దాన్ని మనస్పూర్తిగా స్వీకరించండి. మీరు చిన్నప్పటి నుంచి ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌ల కోసమే కదా క్రికెట్ ఆడింది! కాబట్టి ఒత్తిడిలో ఉన్నప్పుడు భయపడకుండా సానుకూల నిర్ణయాలు తీసుకోండి. మైదానంలోకి వెళ్ళినప్పుడు ఆ 40 ఓవర్ల ఆటను ఎంజాయ్ చేయండి. ఒకరి కోసం ఒకరు ఆడండి” అంటూ గంభీర్ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.

గంభీర్ ఇచ్చిన ఈ స్ఫూర్తితో టీమ్ ఇండియా వెస్టిండీస్‌ను చిత్తు చేసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మార్చి 5న ఇంగ్లాండ్‌తో జరగనున్న కీలక పోరుకు గంభీర్ సేన సిద్ధమవుతోంది. తన తండ్రిని కోల్పోయిన బాధలోనూ రింకూ సింగ్ చూపించిన అంకితభావం, అతనికి అండగా నిలిచిన గంభీర్ తీరు క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకుంది. ఒక కోచ్‌గా ఆటగాళ్ల మానసిక స్థితిని అర్థం చేసుకోవడంలో గంభీర్ ది బెస్ట్ అని మరోసారి నిరూపించుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us