Major Movie: స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ శశికిరణ్.. అడివి శేష్ ఎమోషనల్.. ఇండియా లవ్స్ మేజర్ సక్సెస్ మీట్‏లో..  

26/11 ముంబైదాడులో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న విడుదలై పాజిటివ్ టాక్‏తో దూసుకుపోతుంది.

Major Movie: స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ శశికిరణ్.. అడివి శేష్ ఎమోషనల్.. ఇండియా లవ్స్ మేజర్ సక్సెస్ మీట్‏లో..  
Sashi Kiran Tikka
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 05, 2022 | 8:51 AM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో డైరెక్టర్ శశికిరణ్ తిక్క తెరకెక్కించిన సినిమా మేజర్ (Major). 26/11 ముంబైదాడులో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న విడుదలై పాజిటివ్ టాక్‏తో దూసుకుపోతుంది. ప్రజలను కాపాడేందుకు తన ప్రాణాలను త్యాగం చేసిన మేజర్ సందీప్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు డైరెక్టర్ శశికిరణ్ తిక్క. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటనకు సినీ విశ్లేషకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మేజర్ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో శనివారం ఇండియా లవ్స్ మేజర్ అంటూ సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా డైరెక్టర్ శశికిరణ్ తిక్క మాట్లాడుతూ.. తన తండ్రి చనిపోయిన సంఘటన గుర్తుచేసుకుని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఆయనను ఓదారుస్తూ హీరో అడివి శేష్ సైతం ఎమోషనల్ అయ్యారు.

డైరెక్టర్ శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ.. “మేజర్ అడవి శేష్ డ్రీం ప్రాజెక్ట్ అని నాకు ఎప్పుడో తెలుసు. ఐతే మేజర్ ని నన్ను డైరెక్ట్ చేయమన్నప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. మేజర్ సందీప్ రియల్ హీరో అని తెలుసు. ఐతే ఆయన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో చూడటం తప్పితే ఆయన గురించి డీప్ గా అప్పటికి తెలీదు. ఐతే నా టీం ని ఏర్పాటు చేసుకొని సందీప్ గురించి ఒకొక్క విషయం తెలుసుకోవడం మొదలుపెట్టాం. నా డైరెక్షన్ టీం వినయ్, రాజీవ్ ఎప్పుడూ నా పక్కనే వున్నారు. గౌతమ్ వీఎఫ్ ఎక్స్ అంతా తానె చూసుకున్నాడు. దినేష్ , అనురాగ్, మనోజ్ కూడా అద్భుతంగా పని చేశారు. సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు అద్భుతమైన విజువల్స్ అందించారు. నా మనసులో వున్న విజువల్స్ ని ప్రజంట్ చేశారు. అవినాస్ కొల్లా అద్భుతమైన సెట్స్ వేశారు. తాజ్ హోటల్ ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. కస్ట్యూమ్స్ ని అద్భుతంగా డిజైన్ చేసిన రేఖాకి థ్యాంక్స్ . శోభితా, సాయీ అద్భుతంగా చేశారు. అడవి శేష్ కి స్పెషల్ థాంక్స్. మేజర్ లాంటి గొప్ప సినిమా చేసే అవకాశం ఇచ్చారు. రచయిత అబ్బూరి రవి గారి సపోర్ట్ ని కూడా మర్చిపోలేం.

మేజర్ సందీప్ పేరెంట్స్ తో ప్రయాణం మర్చిపోలేం. వాళ్ళు చెప్పిన ప్రతి మాటని నోట్ చేసుకున్నాం. సందీప్ ఫాదర్ నాతో ఒక మాట చెప్పారు. సందీప్ మాతోనే వున్నాడు. మాకు ప్రతి విషయాన్ని గైడ్ చేస్తుంటాడని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పింది అప్పుడు నాకు అర్ధం కాలేదు. నేను మేజర్ షూటింగ్ లో వుండగా మా నాన్నగారు చనిపోయారు. శేష్ కి ఫోన్ చేసి వెళ్ళిపోయాను. అక్కడి వెళ్ళిన తర్వాత నువ్వు సినిమా షూటింగ్ వెళ్ళు. ముందు సినిమాని పూర్తి చెయ్” అని మా నాన్న చెప్పినట్లనిపించింది. అప్పుడు మేజర్ సందీప్ నాన్నగారి మాటలు గుర్తుకువచ్చాయి. మూడు రోజుల తర్వాత మళ్ళీ షూటింగ్ కి వచ్చేశాను.

ఇవి కూడా చదవండి

ప్రకాష్ రాజ్ గారిని ఈ సీన్ లో చూస్తే మా నాన్న గుర్తుకు వచ్చారని, రేవతి గారిని చూస్తే అమ్మ గుర్తుకు వచ్చిందని చాలా మంది నాకు మెసేజులు పెడుతున్నారు. నాకు మా నాన్న గుర్తుకు వచ్చారు. కొందరు చాటుగా ఏడుస్తున్నామని చెబుతున్నారు. కానీ చాటుగా ఏడవద్దు. గర్వంతో కన్నీళ్లు కార్చండి. మేజర్ సందీప్ గారిది గొప్ప జీవితం. ఆయన చాలా గొప్పగా బ్రతికారు” అన్నారు.