Nayanthara Vignesh: నయన్ విఘ్నేష్ పెళ్లికి అతిథిగా తమిళనాడు సీఎం స్టాలిన్.. ప్రత్యేకంగా ఆహ్వానించిన లవ్ బర్డ్స్..
జూన్ 9న వీరిద్ధరి వివాహం కుటుంబసభ్యులు.. బంధుమిత్రులు... సన్నిహితుల మధ్య జరగనుంది. ఇప్పటికే వీరి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి.
లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara).. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9న వీరిద్ధరి వివాహం కుటుంబసభ్యులు.. బంధుమిత్రులు… సన్నిహితుల మధ్య జరగనుంది. ఇప్పటికే వీరి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి.. ప్రస్తుతం ఈ జంట పెళ్లి షాపింగ్, ఆహ్వానపత్రికలు, పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు. అయితే ముందుగా వీరి పెళ్లి తిరుపతిలో జరగనుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల నయన్, విఘ్నేష్ పెళ్లికి సంబంధించిన డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అత్యంత దగ్గరి సన్నిహితులకు ఆ డిజిటల్ ఇన్విటేషన్ వీడియోను పంపారట. ప్రస్తుతం పెళ్లి పనులలో బిజీగా ఉన్న ఈ జంట.. తాజాగా తమ పెళ్లికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను ఆహ్వానించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ఆయన కుమారుడు హీరో, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ను ప్రత్యేకంగా కలిసి తమ పెళ్లికి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. నయన్, విఘ్నేష్ స్వయంగా సీఎం స్టాలిన్ను కలిసి తమ పెళ్లి ఆహ్వానపత్రికను అందచేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి. మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో హిందూ సంప్రదాయల ప్రకారం నయన్, విఘ్నేష్ పెళ్లి జరగునుంది. ఇక అదే వేదికపై జూన్ 8న సాయంత్రం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని సినీప్రముఖులు, పొలిటీషియన్స్ మధ్య రిసెప్షన్ ఘనంగా జరుగుందని సమాచారం. ఇప్పటికే రజినీ కాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, కార్తీ, శివకార్తికేయన్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖులకు ఆహ్వానం అందినట్లుగా సమాచారం.