Major Movie: ఆర్మీలోకి వెళ్లాలనుకునేవారికి నా ప్రామిస్.. సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతో వారికి సహాయం చేస్తాం.. హీరో అడివి శేష్ ఆసక్తికర కామెంట్స్..

ఇండస్ట్రీలో ఒక అలవాటు వుంది. మార్నింగ్ షో అయిపోగానే సినిమా గురించి మంచిగా వింటున్నాం అని మెసేజ్ వస్తే.. సినిమా పొయిందని అర్ధం.

Major Movie: ఆర్మీలోకి వెళ్లాలనుకునేవారికి నా ప్రామిస్.. సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతో వారికి సహాయం చేస్తాం.. హీరో అడివి శేష్ ఆసక్తికర కామెంట్స్..
Major
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 05, 2022 | 7:55 AM

26/11 ముంబై దాడులలో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్ (Major). జూన్ 3న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్‏తో దూసుకుపోతుంది. టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శశికిరణ్ తిక్క తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తెలుగుతోపాటు హిందీ, మలయాళంలో విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో మేజర్ చిత్రం ఒక మైలురాయి అంటూ సినీ విశ్లేషకులు సైతం కితాబునిచ్చారు. ఇందులో సందీప్ పాత్రలో హీరో అడివి శేష్ అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. మేజర్ సినిమా దేశవ్యాప్తంగా ప్రభంజన విజయం సాధించిన నేపధ్యంలో ”ఇండియా లవ్స్ మేజర్ ‘ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా అడివి శేష్ (Adivi Sesh) మాట్లాడుతూ మేజర్ సినిమా కాదని.. ఓ ఎమోషన్ అంటూ చెప్పుకొచ్చారు.

అడివి శేష్ మాట్లాడుతూ.. ” ఇండస్ట్రీలో ఒక అలవాటు వుంది. మార్నింగ్ షో అయిపోగానే సినిమా గురించి మంచిగా వింటున్నాం అని మెసేజ్ వస్తే.. సినిమా పొయిందని అర్ధం. ఫోన్ కంటిన్యూగా మ్రోగుతుంటే సినిమా హిట్ అని అర్ధం. నిన్నటి నుండి కంటిన్యూ కాల్స్ తో నా ఫోన్ ఫ్రీజ్ అయిపొయింది. కొత్త ఫోన్ కొనుక్కువాల్సివస్తుంది. ఎమోషనల్ గా, కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకూ నా సినిమాలన్నీటి కంటే ‘మేజర్’ ఐదు రెట్లు పెద్దది. మేజర్ సందీప్ విషయానికి వస్తే ఆయన్ని ఎంత ప్రేమించినా సరిపోదనే భావన వుంది. నా గత చిత్రం ‘ఎవరు’ కంటే ఐదు రెట్లు ఎక్కువగా మేజర్ ఓపెనింగ్స్ వున్నాయని బాక్సాఫీసు లెక్కలు చెబుతున్నాయి. ఐతే మేజర్ ని నేను సినిమాగా చూడటం లేదు ఇది ఎమోషన్. ఇదే సంగతి ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పా. ఈ ఎమోషన్ ఇంకా బిగ్గర్ కాబోతుందని ఇప్పుడు పోస్ట్ రిలీజ్ ఈవెంట్ లో చెబుతున్నాను.

నా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. మేజర్ సందీప్ పేరెంట్స్ ని మిస్ అవుతున్నా. అలాగే మా గురువు గారు అబ్బూరి రవి గారి సపోర్ట్ ని మర్చిపోలేను. ఈ చిత్రానికి గ్రేట్ గైడ్ అబ్బూరి రవి గారు. అన్నపూర్ణ స్టూడియోస్ టీంకి కృతజ్ఞతలు. ఒక పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ చేయాల్సిన పనికంటే పది రెట్లు ఎక్కువ చేశారు. అలాగే కాస్ట్యూమ్స్ ని అద్భుతంగా డిజైన్ చేసిన రేఖాకి స్పెషల్ థ్యాంక్స్. మేజర్ సినిమా చూసిన చాలా మంది ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని వుందని మెసేజ్ పెడుతున్నారు. ఈ వేదికపై మేజర్ ప్రామిస్ చేస్తున్నా. సిడిఎస్, ఎన్డీఏ లో జాయిన్ అవ్వాలనుకుని సరైన వనరులు లేక కష్టపడుతున్న వారికి సపోర్ట్ చేయాలని మేజర్ టీమ్ నిర్ణయించింది. అది ఎలా అనేది రాబోతున్న రోజుల్లో స్పష్టంగా వెల్లడిస్తాం. మొదట ఒక పదిమందితోనే మొదలుపెడతాం. అది కోట్లమందిగా మారుతుందని నమ్ముతున్నాం. ఇదో పెద్ద మూమెంట్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతో ఈ మూమెంట్ ని లాంచ్ చేస్తాం. మేజర్ చిత్రాన్ని మా పేరెంట్స్ కి డెడికేట్ చేస్తున్నా. ఈ చిత్రాన్ని మరింత పెద్ద విజయం చేయాలని కోరుతున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు.