Nandamuri Balakrishna: బాలకృష్ణతో సమరానికి సై అంటోన్న తెలుగమ్మాయి.. నెట్టింట ట్రెండింగ్..
Anjali: నటసింహం బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అటు అఖండతో బాలకృష్ణ, ఇటు ఎఫ్3తో అనిల్ రావిపూడి భారీ విజయాలు...
Nandamuri Balakrishna: నటసింహం బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అటు అఖండతో బాలకృష్ణ, ఇటు ఎఫ్3తో అనిల్ రావిపూడి భారీ విజయాలు అందుకున్న నేపథ్యంలో వస్తోన్న సినిమా కావడంతో ఈ కొత్త సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మొన్నటి మొన్న ఈ సినిమాలో రవితేజ కూడా నటించనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక ఇందులో బాలకృష్ణ కూతురిగా పెళ్లిసందD ఫేమ్ శ్రీలీల నటిస్తోంది.
జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో కొత్త న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో తెలుగు అమ్మాయి అంజలి నటిస్తోందని తెలుస్తోంది. అయితే అంజలి హీరోయిన్‌గా కాకుండా విలన్ పాత్రలో నటించనుందని సమాచారం. బాలయ్యలాంటి పవర్ ఫుల్ హీరోను ఢీకొట్టే రేంజ్‌లో అంజలి క్యారెక్టర్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ప్రతీ సినిమాలో తన మార్క్ కామెడీతో భారీ విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి బాలకృష్ణతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..