Disha Patani: ‘ఏదో అనుకొని మరెదో అయ్యాను’… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ బ్యూటీ..
Disha Patani: రానా హీరోగా వచ్చిన 'లోఫర్' చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార దిశా పటానీ. రెండో సినిమా 'ధోనీ'లో నటించి ఒక్కసారి బాలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకుందీ బ్యూటీ...
Disha Patani: రానా హీరోగా వచ్చిన ‘లోఫర్’ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార దిశా పటానీ. రెండో సినిమా ‘ధోనీ’లో నటించి ఒక్కసారి బాలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఓవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూనే మరోవైపు గ్లామర్ పాత్రల్లో నటిస్తోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్-కే సినిమాలో తళుక్కుమననుంది.
చాలా మంది తమ జీవితాల్లో ఏదో అవ్వాలనుకొని మరెదో అవుతామని చెబుతుంటారు. తాజాగా దిశా పటానీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. కెరీర్‌లో పైలట్‌గా స్థిరపడాలనుకున్నాని చెప్పుకొచ్చిన దిశా.. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని తెలిపింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న దిశా తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ విషయమై దిశా మాట్లాడుతూ.. ‘నన్ను పటానీ అని పిలవడం అస్సలు ఇష్టముండదు.. ‘దిశా పట్నీ’ అనాలని మొత్తుకున్నా ఎవరు వినట్లేదు.
సంపాదన కోసం కమర్షియల్ యాడ్స్‌లో నటించడం ప్రారంభించాను, క్రమంగా కెమెరా వైపు ఆకర్షితమయ్యాను. డైట్‌ను తప్పకుండా ఫాలో అయినా చికెన్, స్వీట్స్ చూస్తే అస్సలు ఆగలేను. ఆదివారం ఒక్కరోజు మాత్రం రూల్స్ బ్రేక్ చేస్తాను’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. అయితే తనకు ఫిట్‌నెస్‌పై ఇంట్రెస్ట్ పెరగడానికి సల్మాన్, జాకీచాన్‌లతో కలిసి పనిచేయడమే కారణమని తెలిపింది దిశా. వారి దగ్గరి నుంచే టిప్స్ నేర్చుకున్నట్లు పేర్కొంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..