Vikram Movie: దుమ్మురేపుతోన్న ‘లోకనాయకుడు’.. రెండు రోజుల్లోనే ఆ రికార్డు సొంతం చేసుకున్న విక్రమ్..
Vikram Movie: కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన చిత్రం 'విక్రమ్'. 'ఖైదీ' సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా...
Vikram Movie: కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. ‘ఖైదీ’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటావ్ టాక్‌తో దూసుకుపోతోంది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్క్‌ను దాటేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కమల్ హాసన్ కెరీర్‌లో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన మూడో చిత్రంగా నిలిచింది విక్రమ్. కమల్ నటించిన దశావతారం, విశ్వరూపం తర్వాత రూ. 100 కోట్ల గ్రాసర్ సాధించిన జాబితాలో నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ విక్రమ్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఏపీతో పాటు తెలంగాణలో విక్రమ్ సినిమా తొలి రోజు రూ. 2.8 కోట్లు వసూలు చేయగా, రెండో రోజున రూ. 3 కోట్లకుపైగా వసూలు చేసింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. విడుదలకు ముందే ఎన్నో అంచనాలు ఉండడంతో ఈ సినిమా డిజిటల్ హక్కులు హాట్‌స్టార్ భారీ మొత్తానికి సొంతం చేసుకుందని సమాచారం. జూలై మొదటి వారంలో విక్రమ్ ఓటీటీలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..