Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Panday: పుష్ప పాటకు చిందులేసిన అనన్య.. నెట్టింట్లో వైరలవుతోన్న లైగర్‌ బ్యూటీ డ్యాన్స్‌ వీడియో..

Pushpa: తాజాగా బాలీవుడ్‌ భామ అనన్య పాండే (Ananya Panday) కూడా పుష్ప పాటకు చిందులేసింది. ఈ చిత్రంలో బ్లాక్‌ బస్టర్‌ సాంగ్‌గా నిలిచిన సామి నా సామి పాటను రీక్రియేట్‌ చేసింది. రష్మిక వేసిన సిగ్నేచ‌ర్ స్టెప్‌ను అనుకరించి ఆకట్టుకుంది.

Ananya Panday: పుష్ప పాటకు చిందులేసిన అనన్య.. నెట్టింట్లో వైరలవుతోన్న లైగర్‌ బ్యూటీ డ్యాన్స్‌ వీడియో..
Ananya Panday
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jun 06, 2022 | 6:36 AM

Pushpa: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్లుగా నటించిన పుష్ప ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రంలోని పాటలు, డైలాగులు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఒక రేంజ్‌లో పేలాయి. సోషల్‌ మీడియాలో కూడా వీటికి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సినీ తారలతో పాటు క్రికెటర్లు, వివిధ రంగాల సెలబ్రిటీలు కూడా పుష్ప పాటలు, డైలాగులను రీక్రియేట్‌ చేసి అలరించారు. తాజాగా బాలీవుడ్‌ భామ అనన్య పాండే (Ananya Panday) కూడా పుష్ప పాటకు చిందులేసింది. ఈ చిత్రంలో బ్లాక్‌ బస్టర్‌ సాంగ్‌గా నిలిచిన సామి నా సామి పాటను రీక్రియేట్‌ చేసింది. రష్మిక వేసిన సిగ్నేచ‌ర్ స్టెప్‌ను అనుకరించి ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కాగా అనన్యతో పాటు సారా అలీఖాన్‌ ప్రస్తుతం ఐఫా- 2022 అవార్డు ప్రదానోత్సవాల కోసం అబుదాబిలో ఉన్నారు. ఈ ఈవెంట్ పూర్తయిన త‌ర్వాత‌ అనన్య అబుదాబిలోని ఓ హోట‌ల్ రూంలో సామి సామి పాట సిగ్నేచ‌ర్ స్టెప్పు వేసింది. ఈ వీడియోను సారా అలీఖాన్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ త‌ర్వాత ర‌ష్మిక కూడా ఈ వీడియోను రీపోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట్లో బాగా వైరలవుతోంది. కాగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనన్యా పాండే త్వరలోనే టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టనుంది. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తోన్న లైగర్‌ సినిమాలో ఈ ముద్దుగుమ్మే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం వరకు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Also Read:

French Open 2022: రోలాండ్‌ గ్యారోస్‌లో రఫెల్‌ రాజసం.. రికార్డు స్థాయిలో 14వ సారి టైటిల్‌ను కైవసం చేసుకున్న స్పెయిన్‌ బుల్‌..

ENG vs NZ: కెప్టెన్సీ పోయినా రికార్డుల్లో తగ్గేదేలే అంటోన్న రూట్‌.. ఆ దిగ్గజ ఆటగాడి సరసన చోటు..

వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే వీటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..