ENG vs NZ: కెప్టెన్సీ పోయినా రికార్డుల్లో తగ్గేదేలే అంటోన్న రూట్‌.. ఆ దిగ్గజ ఆటగాడి సరసన చోటు..

England Vs New Zealand: 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే రూట్‌ 170 బంతుల్లో 115 పరుగులు సాధించి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. రూట్‌తో పాటు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ 54, వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ 32 పరుగులతో రాణించారు.

ENG vs NZ: కెప్టెన్సీ పోయినా రికార్డుల్లో తగ్గేదేలే అంటోన్న రూట్‌.. ఆ దిగ్గజ ఆటగాడి సరసన చోటు..
Joe Root
Follow us
Basha Shek

|

Updated on: Jun 05, 2022 | 7:51 PM

England Vs New Zealand: కెప్టెన్సీని కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్న జోరూట్‌ (Joe Root) ఆటగాడిగా మాత్రం అదరగొడుతూనే ఉన్నాడు. తాజాగా టెస్ట్‌ క్రికెట్‌లో 26వ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు 10వేల పరుగుల మార్కును చేరుకున్నాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ (ENG vs NZ ) నాలుగో రోజు తొలి సెషన్‌లో ఈ ఘనతలను అందుకున్నాడు రూట్‌.  కాగా టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 10,000 పరుగులు పూర్తి చేసుకున్న 14వ ఆటగాడిగా రూట్‌ రికార్డులకెక్కాడు. తద్వారా టెస్టుల్లో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్న అలెస్టర్ కుక్ రికార్డును రూట్‌ సమం చేశాడు. అలెస్టర్ కుక్ తర్వాత 10,000 పరుగులు చేసిన రెండో ఇంగ్లండ్‌ ఆటగాడిగా రూట్‌ నిలిచాడు. అతని సెంచరీ సాయంతో లార్డ్స్ టెస్టులో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే రూట్‌ 170 బంతుల్లో 115 పరుగులు సాధించి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. రూట్‌తో పాటు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ 54, వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ 32 పరుగులతో రాణించారు. కాగా కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ నేతృత్వంలో ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడం విశేషం.

లార్డ్స్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 132 పరుగులకే కుప్పకూలగా… ఇంగ్లండ్‌ సైతం 141పరుగులకే చాపచుట్టేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కోలుకున్న కివీస్‌ ‌285పరుగులు చేసింది. డార్లీ మిచెల్‌ 108,టామ్‌ బ్లండెల్‌ 96 పరుగులతో తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ ఒక దశలో వరుసగా వికెట్లు కోల్పోయింది. కివీస్‌ పేసర్‌ కైలీ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ బ్యాటర్లకు చక్కులు చూపించాడు. ఈ దశలో బరిలోకి దిగిన మాజీ కెప్టెన్‌, కెప్టెన్‌ రూట్‌, స్టోక్స్‌ ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఐదో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయానికి బాటలు పరిచారు. స్టోక్స్‌ ఔటయ్యక రూట్‌..ఫోక్స్‌తో జతకలిశాడు. అభేద్యమైన ఐదో వికెట్‌కు 120పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇంగ్లండ్‌ విజయాన్ని ఖరారు చేశారు. కాగా లార్డ్స్‌లో రూట్‌కిది ఐదో సెంచరీ. అంతేకాదు టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో తొలి సెంచరీ ఇదే కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే వీటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

IIFA 2022: ఐఫాలో సెలబ్రిటీలు రెడ్‌ కార్పెట్‌పై కాకుండా గ్రీన్‌ కార్పెట్‌పై నడుస్తారు.. కారణమేంటో తెలుసా?

F3 Movie: అప్పుడు మహేశ్‌.. ఇప్పుడు వెంకీమామ.. స్టేజ్‌పై డ్యాన్స్‌తో అదరగొట్టిన చిన్నోడు, పెద్దోడు.

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..