- Telugu News Photo Gallery IIFA 2022: Why celebrities at the IIFA Awards walk the green carpet instead of red, 15 years ago because of this changed color in Telugu
IIFA 2022: ఐఫాలో సెలబ్రిటీలు రెడ్ కార్పెట్‌పై కాకుండా గ్రీన్ కార్పెట్‌పై నడుస్తారు.. కారణమేంటో తెలుసా?
సాధారణంగా అవార్డు పేరు వినగానే సెలబ్రిటీలు రెడ్ కార్పెట్‌పైనే ఎక్కువగా నడుస్తుంటారు. అయితే ఐఫాలో మాత్రం సినీతారలు గ్రీన్ కార్పెట్ మీద నడుస్తారు కానీ రెడ్ మీద కాదు. దీనికి ఓ ప్రత్యేక కారణముంది.
Updated on: Jun 05, 2022 | 6:22 PM

ఏటా IIFA అవార్డుల ప్రదానోత్సవం వివిధ దేశాల వేదికగా ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది IIFA ఉత్సవాలు జూన్ 4న అబుదాబిలో జరిగాయి.

દ సాధారణంగా అవార్డు పేరు వినగానే సెలబ్రిటీలు రెడ్ కార్పెట్‌పైనే ఎక్కువగా నడుస్తుంటారు. అయితే ఐఫాలో మాత్రం సినీతారలు గ్రీన్ కార్పెట్ మీద నడుస్తారు కానీ రెడ్ మీద కాదు. దీనికి ఓ ప్రత్యేక కారణముంది.

కార్పెట్ రంగును ఎరుపు నుంచి గ్రీన్‌గా మార్చాలని 15 ఏళ్ల క్రితం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, గ్రీన్ ప్లానెట్ సందేశాన్ని తెలియజేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2007లో UKలోని షెఫీల్డ్‌లో IIFA జరిగినప్పుడు మొదటిసారిగా గ్రీన్ కార్పెట్‌ను ఏర్పాటుచేశారు

సినిమా తారలతో పర్యావరణ సందేశాన్ని అందిస్తే ఎక్కువమందికి చేరుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు IIFA నిర్వాహకులు తెలిపారు.

IIFA అవార్డులను 22 సంవత్సరాల క్రితం విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రారంభించింది. మొదటి IIFA అవార్డులు 2000లో లండన్‌లో జరిగాయి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ అవార్డు ప్రదర్శన ప్రపంచంలోని వివిధ దేశాలలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అబుదాబిలో జరిపారు.

IIFA అవార్డులకు ఇప్పటివరకు దుబాయ్, బ్యాంకాక్, న్యూయార్క్, కొలంబో, ఆమ్‌స్టర్‌డామ్, మాడ్రిడ్, ఫ్లోరిడా, కౌలాలంపూర్, మకావు నగరాలు ఆతిథ్యమిచ్చాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఈ ఏడాది IIFA అవార్డులను హోస్ట్ చేస్తున్నారు.





























