AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : జూమ్ చేసి మరీ మా శరీరాలను ఫోటోస్ తీయొద్దు.. కన్నడ హీరోయిన్స్ ఆగ్రహం..

కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరోయిన్ సప్తమి గౌడ. తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.. పబ్లిక్ ఈవెంట్లు, సినిమా కార్యక్రమాల్లో కొంతమంది ఫోటోగ్రాఫర్లు మహిళా నటీమణులను అనుచిత కోణాల్లో చిత్రీకరిస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక నోట్ రూపంలో పంచుకున్నారు.

Tollywood : జూమ్ చేసి మరీ మా శరీరాలను ఫోటోస్ తీయొద్దు.. కన్నడ హీరోయిన్స్ ఆగ్రహం..
Ashika, Rukmini, Saptami Go
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 04, 2026 | 1:12 PM

Share

మీకు మీటూ ఉద్యమం గుర్తుందా…? సినీ ఇండస్ట్రీనే ఓ కుదుపు కుదిపేసిందా విప్లవం…! హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు బయటకొచ్చి వెల్లబుచ్చుకున్న గోడు అప్పుడు యావత్‌ ఇండస్ట్రీనే షేక్ చేసింది. అలాంటిదే ఇప్పుడు మరో ఉదంతం… అదే ఫోటో పైత్యం…! పబ్లిక్ ఈవెంట్స్‌లో వల్గర్‌ ఫోటోలు తీస్తున్నారు… జూమ్‌ చేసి మరీ బాడీని టార్గెట్‌ చేస్తున్నారు… కాస్త నిర్లక్ష్యంగా ఉన్నామో అభ్యంతరకర యాంగిల్స్‌లో ఫోటోలు క్లిక్‌మనిపించి సోషల్ మీడియాలో సేల్‌ చేసుకుంటున్నారని యంగ్‌ హీరోయిన్స్‌ వార్‌ సైరన్‌ మోగించడం హాట్‌టాపిక్‌గా మారింది. పోరాడుదాం… హద్దు దాటేవాళ్ల అంతుచూసేవరకూ అంటూ విప్లవ గళం వినిపిస్తుండటం రచ్చ లేపుతోంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

ఇలా కదా ఫ్రొఫెషనల్‌ ఫోటోగ్రాఫర్స్‌ ఫ్రేమింగ్ పెట్టి ఫోటోలు తీసేంది. మరి మీరేం చేస్తున్నారు…? వల్గర్‌ ఫ్రేమింగ్‌తో ఇరిటేట్‌ చేస్తున్నారు…! డ్రెస్‌ సర్దుకుంటుంటే ఫోటోలు కొడతారు… నడుచుకుంటూ వెళ్తున్నా పెట్టకూడని ఫ్రేమ్‌లు పెట్టి అభ్యంతరకంగా తీస్తారు… ఇంకొంతమంది మంచి ఫోటోను సైతం మార్ఫింగ్ చేసి అసహ్యంగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని యంగ్ హీరోయిన్లు వాయిస్ రేజ్‌ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..

కాంతారా ఫేమ్‌ రుక్మిణి వసంత్‌, సప్తమీగౌడ… నాసామిరంగ నటి అశికా రంగనాథ్‌ ఈ వల్గర్ క్లిక్స్‌పై గళం విప్పారు. ఇండస్ట్రీని సరికొత్త సమస్య తిప్పలు పెడుతోంది… ఉద్యమించాల్సిన టైమ్‌ వచ్చింది డియర్స్ అంటూ వార్ సైరన్ మోగించారు. ఫ్రేమింగ్ ఎలా ఉండాలో నేర్పిద్దాం… పబ్లిక్‌ మీటింగ్స్‌లో మహిళా నటులను ఎలా గౌరవించాలో చూపిద్దాం… జూమ్ ఇన్ జూమ్‌ అవుట్ ఎక్కడ వాడాలో ఎప్పుడు వాడాలో కాస్త ఘాటుగానే ట్రైనింగ్ ఇద్దాం…. రండి కదిలి రండి సరికొత్త సమస్యను అంతమొందిద్దామంటూ సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీలోని మహిళా నటులందరికి వార్ ఇన్విటేషన్‌ ఇచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ఈవెంట్‌ని కవర్ చేయడానికి వస్తున్నారా…? హీరోయిన్ల శరీరాలను టార్గెట్‌ చేయడానికి వస్తున్నారా…? అభ్యతరకర యాంగిల్స్‌లో పనికట్టుకుని ఫోటోలు వీడియోలు తీస్తారా…? ఉద్దేశపూర్వకంగా జూమ్‌లు చేస్తారా అంటూ ఫోటోగ్రాఫర్స్‌ను కడిగేస్తున్నారు. హలో ఫోటోగ్రాఫర్లు కళను గౌరవించండి… మీ కళా నైపుణ్యాన్ని పెంచుకోండంటూ ఇచ్చిపడేస్తున్నారు. ఈ ఫోటోపైత్యంపై ఫస్ట్ రుక్మిణి వసంత్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పబ్లిక్ ఈవెంట్స్, సినిమా ప్రమోషన్స్, ఆడియో లాంచ్‌ ఈవెంట్స్‌లో మహిళల వీడియోలు, ఫోటోలు కొన్ని అసభ్యకర కోణాల్లో తీస్తున్నారని ఫైర్ అయ్యారు. పనిగట్టుకుని శరీర భాగాలపై జూమ్ చేయడమేంటన్నారు. ఇది ముమ్మాటికి మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమే… అందరు కలిసికట్టుగా ఈ అంశంపై పోరాడాల్సిందేనని వార్‌ షురూ చేశారు.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.

సప్తమీ గౌడ, అశికా రంగనాథ్‌ కూడా ఇదే టోన్ వినిపించారు. వల్గర్ యాంగిల్స్‌ పెట్టే ఫోటోగ్రాఫర్లను తోలు వలచాల్సిందేనంటున్నారు. ఈవెంట్లను కవర్ చేసే ఫోటోగ్రాఫర్లు ప్రొఫెషనల్‌గా, మర్యాదగా వ్యవహరించాలి బాసు అంటున్నారు. ఒకటి రెండు సార్లు కాదు… పదేపదే ఇదే జరుగుతోంది.. ఇదేం దరిద్రం అంటూ అసహనం వ్యక్తం చేశారు. మమల్నీ గౌరవించండి, కానీ కించపరచకండి అంటూ పోస్టులు పెట్టారు. మొత్తంగా… ఫోటోపైత్యంపై హీరోయిన్లు గొంతెత్తడంతో సినీ ఇండస్ట్రీలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చినట్టు కనిపిస్తోంది. కన్నడ హీరోయిన్స్ అయిన ఈ ముగ్గురి పోస్టులపై ఇప్పటికే సోషల్ మీడియాలో డిబేట్లు మొదలయ్యాయి. ఈవెంట్స్‌లో ఫోటోగ్రాఫర్ల హద్దులపై నిబంధనలు పెట్టాలన్న వాయిస్‌ కూడా వినిపిస్తోంది. మరీ టాపిక్‌ ఎంతవరకు వెళ్తుంది…? ఏం జరగబోతోంది…? అన్నది చూడాలి.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.

Follow Us
17 నిమిషాల రేప్ సీన్ తో కాంట్రవర్సీ..కట్ చేస్తే కలెక్షన్ల వర్షం
17 నిమిషాల రేప్ సీన్ తో కాంట్రవర్సీ..కట్ చేస్తే కలెక్షన్ల వర్షం
వంటగ్యాస్ లేదా..దోంట్‌ వర్రీ! ఐరన్‌బాక్స్‌ ఉందిగా వాడేద్దామిలా!!
వంటగ్యాస్ లేదా..దోంట్‌ వర్రీ! ఐరన్‌బాక్స్‌ ఉందిగా వాడేద్దామిలా!!
ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం..
ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం..
రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. ప్రభుత్వం నుంచి అనౌన్స్‌మెంట్
రైతు భరోసా విడుదలకు డేట్ ఫిక్స్.. ప్రభుత్వం నుంచి అనౌన్స్‌మెంట్
మోనాలిసా భర్త బ్యాక్ గ్రౌండ్ ఇదే..వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా
మోనాలిసా భర్త బ్యాక్ గ్రౌండ్ ఇదే..వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా
పనికిరావని పడవేసే పాత్ టూత్ బ్రష్‌లతో.. క్రియేటివ్ ఐడియాస్
పనికిరావని పడవేసే పాత్ టూత్ బ్రష్‌లతో.. క్రియేటివ్ ఐడియాస్
నోట్లపై ఈ నల్లటి గీతలు ఎందుకుంటాయో తెలుసా..? 99శాతం మందికి..
నోట్లపై ఈ నల్లటి గీతలు ఎందుకుంటాయో తెలుసా..? 99శాతం మందికి..
వేసవిలో అత్యంత సుందర నగరంలో ఎంజాయ్ చేయండి.. వీసా కూడా అవసరం లేదు.
వేసవిలో అత్యంత సుందర నగరంలో ఎంజాయ్ చేయండి.. వీసా కూడా అవసరం లేదు.
రైల్లో రీల్స్ రచ్చ..ప్రయాణికుడి వీడియో వైరల్‌
రైల్లో రీల్స్ రచ్చ..ప్రయాణికుడి వీడియో వైరల్‌
కూలీ పనులకు వెళ్లే రైతులకు దూరంలో మసకగా కనిపించింది..
కూలీ పనులకు వెళ్లే రైతులకు దూరంలో మసకగా కనిపించింది..