AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స పూర్తి.. నిహారిక కీలక ప్రకటన

మెగా ప్రిన్స్, టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కు తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. మంగళవారం ( ఏప్రిల్ 14) వాలీబాల్ ఆడుతున్న సమయంలో అతను గాయపడ్డాడు. తీవ్రత ఎక్కువగా ఉండడంతో బుధవారం ( ఏప్రిల్ 14) ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వరుణ్ కు స్వల్ప శస్త్రచికిత్స నిర్వహించారు.

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స పూర్తి.. నిహారిక కీలక ప్రకటన
Varun Tej, Niharika Konidela
Basha Shek
|

Updated on: Apr 15, 2026 | 6:42 PM

Share

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. రీసెంట్‌గానే సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా వ‌రుణ్ తేజ్ వాలీ బాల్ ఆట‌ను ప్రాక్టీస్ చేస్తుండ‌గా మోకాలికి తీవ్ర గాయ‌మైంది. ఈ మోకాలి గాయానికి సంబంధించి వ‌రుణ్ తేజ్‌కు శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. ఈ విష‌యాన్ని నిహారిక త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశారు. ‘నా సోద‌రుడు వ‌రుణ్ తేజ్ ఇటీవ‌ల మేం రూపొందిస్తోన్న బ‌రి సినిమా కోసం వాలీబాల్‌ను ప్రాక్టీస్ చేస్తుండ‌గా మోకాలికి తీవ్ర గాయ‌మైంది. తాజాగా ఆయ‌న్ని ప‌రిశీలించిన డాక్ట‌ర్స్ మోకాలికి ఆపరేష‌న్ చేశారు. ఈ శ‌స్త్ర చికిత్సను వైద్యులు చ‌క్క‌గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశారు. ప్ర‌స్తుతం వ‌రుణ్ అన్న‌య్య డాక్ల‌ర్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటార‌ని భావిస్తున్నాం. ఈ స‌మ‌యంలో మాకు అండ‌గా నిల‌బ‌డి ప్రేమాభిమానాలు చూపించిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు’ అని నిహారిక పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

నిహారిక షేర్ చేసిన పోస్ట్ పై సినీ ప్రముఖులు, మెగాభిమానులు స్పందిస్తున్నారు. వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.  కాగా వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్‌ యదు వంశీ రూపొందిస్తున్న చిత్రం ‘బరి’. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా కోసం వరుణ్‌ గత ఏడు నెలలుగా వాలీబాల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్‌ గాయడగా, శస్త్ర చికిత్స నిర్వహించారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఇదివరకే చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా కన్నా ముందే కొరియన్ కనకరాజు గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వరుణ్.

త్వరలోనే వరుణ్ తేజ్ కోలుకుంటాడు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రక్తం, కాలేయాన్ని క్లీన్ చేసే తాటి బెల్లం.. పంచదార బదులు వాడితే
రక్తం, కాలేయాన్ని క్లీన్ చేసే తాటి బెల్లం.. పంచదార బదులు వాడితే
తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే
తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే
Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు..
Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలు..
మహారాణి గెటప్‌లో జబర్దస్త్ నటి.. ఫొటోస్ వైరల్.. గుర్తు పట్టారా?
మహారాణి గెటప్‌లో జబర్దస్త్ నటి.. ఫొటోస్ వైరల్.. గుర్తు పట్టారా?
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్..
ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె నా ఫేవరెట్..
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు
Bigg Boss Telugu 10: అప్పుడేమో ప్రియుడు.. ఇప్పుడేమో ప్రియురాలు
స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!
స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే కనిపించకుండా పోయింది..!
తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రకంపనలు.. గడవులోపు లెక్కలు తేలేనా?
తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రకంపనలు.. గడవులోపు లెక్కలు తేలేనా?
అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి ఇది తెలియదు
అసలు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? 99 శాతం మందికి ఇది తెలియదు
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించండి
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించండి