AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే పట్టాల పక్కన కనిపించే ఈ బోర్డుల రహస్యమేంటి..? వీటి అర్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు

రైల్వే పట్టాల పక్కన కనిపించే కొన్ని బోర్డులు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. చూడానికి చాలా డిఫరెంట్‌గా కనిపిస్తాయి. వీటికి అర్థం ఏంటి అనేది సాధారణ ప్రయాణికులకు తెలియదు. కానీ వీటి వెనుక చాలా అర్ధం దాగి ఉంటుంది. వీటికి అర్ధాలేంటి అనే విషయాలు చూద్దాం.

Indian Railways: రైల్వే పట్టాల పక్కన కనిపించే ఈ బోర్డుల రహస్యమేంటి..? వీటి అర్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Railway
Venkatrao Lella
|

Updated on: Mar 04, 2026 | 1:10 PM

Share

ప్రతీఒక్కరూ జీవితంలో ఇప్పటివరకు ఒక్కసారైనా రైలు ప్రయాణం చేసి ఉంటారు. రైలు ప్రయాణం చేసే సమయంలో కిటికిలోనుంచి బయటకు చూసే ఉంటారు. అలాంటి సమయంలో రైల్వే ట్రాకుల పక్కన కొన్ని బోర్డులు, సిగ్నల్స్ ఉంటాయి. వాటిపై అక్షరాలు, నెంబర్లు ఉంటూ ఉంటాయి. అవి చూడానికి కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ గుర్తుల వెనుక ఆర్ధమేంటి అనేది మనకు తెలియదు. కానీ రైల్వే ట్రాకుల పక్కన కనిపించే ప్రతీ గుర్తు వెనుక ఒక అర్థం ఉంది. వీటిని తెలుసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా రైల్వే పట్టాల పక్కన ఇంగ్లీష్ అక్షరాలతో కొన్ని బోర్డులు కనిపిస్తాయి. వాటికి అర్థమేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ బోర్డు ఎందుకంటే..?

రైల్వే ట్రాకుల పక్కనే మీరు W/L లేదా C/F అక్షరాలతో బోర్డులు చూసే ఉంటారు. పసుపు రంగు బోర్డుపై నలుపు రంగుతో అక్షరాలు ముద్రించి ఉంటాయి. ఈ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేస్తారు.. ఈ అక్షరాల వెనుక అర్ధం ఏంటనే విషయం చాలామందికి తెలయదు. అవేవో రైల్వే సిగ్నల్స్ అనుకుని పట్టించుకోవడం మానేస్తారు. కానీ వాటి వెనుక చాలా అర్థం ఉంది. లోకో పైలట్లకు ట్రాఫిక్ సిగ్నల్స్ తరహాలో అవి ఉపయోగపడతాయి. లోట్ పైలట్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానికి చేర్చడంలో ఇవి సహాయపడతాయి. W/L అర్ధం అంటే విజిల్ లేదా లెవల్ అని అర్ధం. ఈ బోర్డును ట్రాకులకు ఇరువైపులా అన్ మ్యాన్, మ్యాన్ క్రాసింగ్ ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ బోర్డ్ ఉన్నచోట లోకో పైలట్ తప్పనిసరిగా హారన్ మోగించాల్సి ఉంటుంది. రైలు క్రాసింగ్ దగ్గరికి వస్తున్నప్పుడు హారన్ మోగించాలని ఈ బోర్డు సూచిస్తుంది. క్రాసింగ్‌కు 250 నుంచి 300 మీటర్ల దూరంలో ఈ బోర్డులు ఏర్పాటు చేస్తారు.

రైల్వే గేట్ల వద్ద సంకేతం

ఇక C/F లేదా C/Fa అంటే Whistle Blowing/Gate అని అర్థం. రైల్వే గేటుకు 600 కిలోమీటర్ల దూరంలో ఈ బోర్డులు ఉంటాయి. అంటే కాపాలా లేని గేట్ల వద్ద ట్రైన్ వస్తుందనే సంకేతం ఇవ్వడానికి లోకో పైలట్ హారన్ మోగించాలనే నియమాన్ని ఇది గుర్తు చేస్తుంది. దీని వల్ల ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. డ్రైవర్లు సరైన సమయంలో ముందుగానే హారన్ కొట్టాలని ఇవి గుర్తు చేస్తాయి. దీని వల్ల ట్రైన్ వస్తుందని ప్రజలు, జంతువులకు ముందే తెలియడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయి. ఇందుకోసం ఆ బోర్డులు లోకో పైలెట్లకు గుర్తుగా సహాయపడతాయి. ఇలా రైల్వే ట్రాకుల పక్కనే కనిపించే ఈ బోర్డుల వెనుక అనేక రహస్యాలు ఉన్నాయన్నమాట.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర