AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol: ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు.. అస్సలు ఊహించలేరు..

ప్రపంచం మరో మహా యుద్ధం అంచున నిలబడింది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధ జ్వాలలు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌ను వణికిస్తున్నాయి. ఎక్కడో వేల మైళ్ల దూరంలో జరుగుతున్న ఈ పోరాటం నేరుగా సామాన్య భారతీయుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తోంది. అయితే ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Petrol: ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు.. అస్సలు ఊహించలేరు..
Petrol Price In Iran Vs India
Krishna S
|

Updated on: Mar 04, 2026 | 1:07 PM

Share

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడి దాడులు ప్రపంచ దేశాలను వణికించడమే కాకుండా సామాన్య భారతీయుడి బడ్జెట్‌ను కుదిపేసేలా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో లీటర్ పెట్రోల్ వంద రూపాయల మార్కును దాటిన తరుణంలో ఇరాన్‌లోని ధరలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అక్కడ లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ.2 నుండి రూ.5 మధ్యలోనే ఉంటుంది. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాలలో ఒకటి. సొంతంగా భారీ నిల్వలు ఉండటంతో వారు ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇరాన్ ప్రభుత్వం తన ప్రజల కోసం ప్రపంచంలోనే అత్యధికంగా ఇంధన సబ్సిడీలను అందిస్తోంది. ప్రభుత్వం నష్టాలను భరించి మరీ తక్కువ ధరకు పెట్రోల్‌ను సరఫరా చేస్తుంది.

భారత్‌లో ధరలు ఎందుకు ఎక్కువ?

ఇరాన్‌తో పోలిస్తే మన దేశంలో పరిస్థితి భిన్నం. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

దిగుమతులపై ఆధారపడటం: మన దేశ చమురు అవసరాల్లో దాదాపు 80 శాతం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. దీనికి షిప్పింగ్ ఖర్చులు, డాలర్ మార్పిడి రేటు అదనంగా తోడవుతాయి.

పన్నుల భారం: ఇరాన్‌లో సబ్సిడీలు ఉంటే భారత్‌లో పన్నులు ఉన్నాయి. కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ కలిపితే పెట్రోల్ అసలు ధరపై దాదాపు 40 నుండి 50 శాతం పన్నులే ఉంటున్నాయి.

యుద్ధం ముదిరితే రూ. 110 దాటడం ఖాయమా?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఇలాగే కొనసాగితే.. చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడి బ్రెంట్ క్రూడ్ ధర భారీగా పెరుగుతుంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో భారత్‌లో పెట్రోల్ ధర రూ.110 దాటినా ఆశ్చర్యం లేదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

సామాన్యుడిపై చైన్ రియాక్షన్ ప్రభావం:

ఇంధన ధరలు పెరిగితే అది కేవలం వాహనదారులకే పరిమితం కాదు.. రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా కూరగాయలు, పప్పులు, కిరాణా సామాగ్రి వంటి నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. మొత్తానికి ఎక్కడో వేల మైళ్ల దూరంలో జరుగుతున్న ఈ యుద్ధం, భారతీయుడి వంటింటి బడ్జెట్‌ను తలకిందులు చేసేలా ఉంది.

Follow Us
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే
కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!
కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర