Mitchell Marsh: భారత్‌లో నాకు శాపం తగిలిందేమో.. అందుకే ప్రతిసారి గాయాలు.. ఆసీస్ ఆల్‌రౌండర్ షాకింగ్ కామెంట్స్..
Mitchell Marsh: ఐపీఎల్-2022లోనే కాదు గతంలో 2020, 21 సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన మార్ష్.. అప్పుడు కూడా గాయం కారణంగా అర్థాంతరంగా టోర్నీల నుంచి తప్పుకున్నాడు మార్ష్.
Mitchell Marsh: ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తన సత్తా మేర ఆడలేకపోయింది. పేపర్‌పై బలంగా కనిపించిన ఆ జట్టు మైదానంలో మాత్రం అంచనాల మేరకు రాణించలేకపోయింది. నిలకడలేమి ఆటతీరుతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కాగా రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌లో వార్నర్, మిషెల్ మార్ష్ లాంటి టాప్ ఆటగాళ్లున్నారు. పైగా రికీపాంటింగ్ కోచ్‌గా వ్యవహరించినా ఆ జట్టు రాణించలేకపోయింది. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌ను విశ్వవిజేతగా నిలిపిన మార్ష్ ఐపీఎల్ టోర్నీ మధ్యలోనే కొవిడ్ బారిన పడ్డాడు. దీంతో కొన్ని మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శనపై, తన ఆటతీరు గురించి మిషెల్ మార్ష్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా ఇండియాకు వచ్చిన ప్రతిసారి తాను గాయపడుతున్నానని, తనకు ఇక్కడ ఏదో శాపం తగిలిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను ఇండియాకు రావడానికి కొద్దిరోజుల ముందే గాయపడ్డాను. ఇక్కడికొచ్చి ఒక మ్యాచ్ ఆడాక నాకు కొవిడ్ వచ్చింది. అప్పుడు నేను నిజంగా షాక్ కు గురయ్యా. ఇండియాలో నాకు ఏదైనా శాపం తగిలిందా..? అని అనిపించింది. అయితే అదృష్టవశాత్తూ నేను కరోనా నుంచి త్వరగానే కోలుకున్నా. తిరిగి ఢిల్లీ జట్టుతో చేరి నా స్థాయి మేర రాణించాను’ అంటూ చెప్పుకొచ్చాడీ ఆసీస్ ఆల్‌రౌండర్. ఐపీఎల్-2022లోనే కాదు గతంలో 2020, 21 సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన మార్ష్.. అప్పుడు కూడా గాయం కారణంగా అర్థాంతరంగా టోర్నీల నుంచి తప్పుకున్నాడు.
నాలో స్ఫూర్తి నింపింది అతనే..
ఇదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్‌పై మార్ష్ ప్రశంసలు కురిపించాడు. ‘ నేను జట్టులో చేరినప్పుడు అందరూ రికీ పాంటింగ్ గురించి గొప్పగా చెప్పారు. క్రికెట్‌లో అతను ఏం సాధించాడో ఒక ఆస్ట్రేలియన్ గా నాకు బాగా తెలుసు. అయితే ఢిల్లీ జట్టుతో కలిసినప్పుడు పాంటింగ్‌తో కలిసి చేసిన ప్రయాణం మర్చిపోలేనిది. అతను తన ఆటగాళ్లను ఎంత బాగా చూసుకుంటాడో అర్థమైంది. నేను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంత కీలక ఆటగాడినో పాంటింగ్ నాకు చెప్పేవాడు. ఆ దిశగా నాలో స్ఫూర్తి నింపేవారు. గాయాలతో నాలో నమ్మకం సన్నగిల్లినప్పుడల్లా నాతో మాట్లాడి నా ఆత్మ విశ్వాసం పెరిగేలా సహకరించాడు’ అని మార్ష్ తెలిపాడు. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: