Hyderabad: రన్నింగ్ ట్రైన్ నుంచి బ్యాగ్ విసిరేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఓ పర్సన్ దాన్ని విప్పి చూడగా…

హైదారాబాద్‌లో ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. తనకు దొరికిన ఓ పార్శిల్ ద్వారా అతను చిక్కుల్లో పడ్డాడు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Hyderabad: రన్నింగ్ ట్రైన్ నుంచి బ్యాగ్ విసిరేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఓ పర్సన్ దాన్ని విప్పి చూడగా...
Representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 05, 2022 | 4:30 PM

Telangana News: హైదరాబాద్ నగరంలోని తుకారంగేట్(tukaram gate) పోలీస్ స్టేషన్ పరిధిలో  ఓ వ్యక్తి  గంజాయిలో నార్కొటిక్ పదార్థాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు పోలీసులుకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వెంటనే అలెర్టైన పోలీసులు అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో  1.03 లక్షలు విలువ చేసే ఐదు కేజీల గంజాయి సరుకును స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. అడ్డగుట్ట(addagutta) వడ్డెర బస్తీ పోచమ్మ ఆలయం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల గుగులోత్ కార్తీక్ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో కార్తీక్ ఇంట్లో గంజాయి సరుకుతో పాటు నార్కొటిక్ పదార్థాలు కలిపి బయట అమ్ముతున్నట్లు పోలీసులకు కాల్ వచ్చింది. వెంటనే తుకారాంగేట్ పోలీసులు.. అతని ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న 1.3 లక్షల విలువ చేసే గంజాయి సరకును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

సరుకు ఎలా వచ్చిందంటే..?

కార్తీక్ ఈనెల 2న తుకారాంగేట్ ఆర్‌ఆర్‌సీ మైదానం రైలు పట్టాల మీదగా వెళ్తుండగా.. అదే సమయంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నుంచి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గంజాయి సరకుతో ఉన్న బ్యాగ్‌ను బయటికి విసిరేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కార్తీక్ ఆ బ్యాగులో ఏముందో అని ఓపెన్ చేసి చూశాడు. లోపల చెక్ చేయగా అందులో గంజాయి ఉందని అర్థమైంది. అతడికి అప్పటికే గంజాయి అలవాటు ఉండటంతో.. సరుకును పొట్లాలుగా తయారు చేసి విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..