CDAC Recruitment: ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాద్‌ సీ-డ్యాక్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

CDAC Recruitment: హైదారాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ...

CDAC Recruitment: ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాద్‌ సీ-డ్యాక్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Cdac Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 05, 2022 | 4:40 PM

CDAC Recruitment: హైదారాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌ (01), ప్రాజెక్ట్‌ లీడర్లు (03), సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు (02), ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు (02), ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు (08) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభం, టెక్నికల్‌ నాలెడ్జ్‌ తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 20-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..