AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushanth: ‘మీరు వర్జినేనా’.? నెటిజన్‌ ప్రశ్నకు దిమ్మదిరిగే ఆన్సర్‌ ఇచ్చిన అక్కినేని యంగ్‌ హీరో..

Sushanth: సోషల్‌ మీడియా (Social Media) విస్తృతి పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలు, సామాన్యులకు మధ్య అంతరం చెరిగిపోతోంది. అభిమానులు తమ ఫేవరేట్‌ హీరోలతో నేరుగా మాట్లాడుతున్నారు. హీరో, హీరోయిన్లు...

Sushanth: 'మీరు వర్జినేనా'.? నెటిజన్‌ ప్రశ్నకు దిమ్మదిరిగే ఆన్సర్‌ ఇచ్చిన అక్కినేని యంగ్‌ హీరో..
Narender Vaitla
|

Updated on: Jun 05, 2022 | 4:11 PM

Share

Sushanth: సోషల్‌ మీడియా (Social Media) విస్తృతి పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలు, సామాన్యులకు మధ్య అంతరం చెరిగిపోతోంది. అభిమానులు తమ ఫేవరేట్‌ హీరోలతో నేరుగా మాట్లాడుతున్నారు. హీరో, హీరోయిన్లు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా చిట్‌చాట్‌లు నిర్వహిస్తూ ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అయితే కొందరు అభిమానులు మాత్రం అత్యుత్యాహం ప్రదర్శిస్తూ, సెలబ్రిటీలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తుంటారు.

ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే అక్కినేని యంగ్‌ హీరో సుశాంత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘షూట్ యూవర్‌ క్వశ్చన్స్‌’ పేరుతో చిట్‌చాట్‌ నిర్వహించాడు. ఇందులో భాగంగానే ఓ నెటిజన్‌.. ‘మీరు వర్జినేనా.?’ అని ప్రశ్నించాడు. సహజంగా అయితే ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు ఎవరైనా కాస్త అసహనానికి గురవుతారు. కానీ సుశాంత్‌ మాత్రం చాలా కూల్‌గా వెరైటీగా స్పందించాడు. సదరు నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు బదులుగా ఒక దీపం ఫొటోను పోస్ట్‌ చేశాడు. తాను నిప్పు అని అర్థం వచ్చేలా సుశాంత్‌ చేసిన పోస్ట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.

Sushanth

ఇవి కూడా చదవండి

ఇక మరో అభిమాని ‘మీరు అల్లు అర్జున్‌తో మళ్లీ ఎప్పుడు నటిస్తారు’ అడగ్గా.. ‘అల.. వైకుంఠపురములో-2 ఎప్పుడు ఉంటుందో చెప్పు బన్నీ’ అంటూ అల్లు అర్జున్‌ని ట్యాగ్ చేశారు. ఇదిలా ఉంటే అలవైకుంఠపురములో సినిమాతో చాలా రోజుల తర్వాత లైమ్‌లైట్‌లోకి వచ్చిన సుశాంత్‌ ప్రస్తుతం ‘రావణాసుర’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మాస్‌ మహారాజ హీరోగా నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..