Venkatesh: ఎఫ్3లో నారప్పగా కనిపించింది అందుకే.. ఆసక్తికర విషయం చెప్పిన వెంకీ
సమ్మర్ లో సందడి చేసిన సినిమాల్లో ఎఫ్ 3 ఒకటి. అనిల్న్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
సమ్మర్ లో సందడి చేసిన సినిమాల్లో ఎఫ్ 3(F3) ఒకటి. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ మరోసారి కలిసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఒక ఫ్యామిలీ సినిమా కోవిడ్ తర్వాత వందకోట్లు టచ్ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ విజయం ప్రేక్షకుల వల్లే సాధ్యమైయింది అని పేర్కొంది ఎఫ్ 3 టీమ్. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘ఎఫ్3 ‘మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తొమ్మిది రోజుల్లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్ట్ చేసి హౌస్ ఫుల్ వసూళ్ళతో దూసుకుపోతున్న ఈ చిత్రం ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ‘ఫన్’టాస్టిక్ ఈవెంట్ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ..
ఎఫ్ 3ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అభిమానులకి ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు వెంకటేష్. వైజాగ్ అంటే నాకు చాల స్పెషల్. నా మొదటి సినిమా కలియుగ పాండవులు ఇక్కడే చేశాను. స్వర్ణ కమలం, గోపాల గోపాల, సీతమ్మ వాకిట్లో,మల్లీశ్వరి, గురు ఇలా చాలా సినిమాలు ఇక్కడ చేశాను. ఇక్కడ ఎఫ్ 3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వేడుక జరుపుకోవడం ఆనందంగా వుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు గారు మంచి స్క్రిప్ట్ తో వచ్చారు. మీరు గొప్ప విజయాన్ని అందించారు. నారప్ప, దృశ్యం ఓటీటీ కి వెళ్ళడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. అందుకే ఎఫ్ 3లో నారప్ప గెటప్ లో వచ్చి ఫ్యాన్స్ ని థ్రిల్ చేయాలనీ అనుకున్నాను. ఈ చిత్రానికి పని చేసిన టెక్నికల్ టీంకి, ఆర్టిస్ట్ లకి అందరికీ థాంక్స్. ఈ ఈవెంట్ లో లేడి , ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వుండటం ఆనందంగా వుంది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మరోసారి కృతజ్ఞతలు అని అన్నారు వెంకటేష్.