Childhood Pic: విద్యార్థి జీవితం ఎంతో మధురం.. ఈ ఫొటోలోని స్టూడెంట్.. యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా ఎవరో గుర్తుపట్టారా..

ఓ దక్షిణాది విలక్షణ హీరోయిన్ స్కూల్ లైఫ్ కు చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటోలో ఉన్న హీరోయిన్ మంచి నటి, డ్యాన్సర్ మాత్రమే కాదు.. డాక్టర్ కూడా ఎవరో మీరు గుర్తు పట్టారా..!

Childhood Pic: విద్యార్థి జీవితం ఎంతో మధురం.. ఈ ఫొటోలోని స్టూడెంట్.. యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా ఎవరో గుర్తుపట్టారా..
Childhood Photo
Follow us
Surya Kala

|

Updated on: Jun 05, 2022 | 3:34 PM

Childhood photo: ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యంలో జ్ఞాపకాలాలు జీవితంలో ఎంత విలువైనవో.. విద్యార్థిగా స్కూల్ డేస్ కూడా అంతే మధురమైనవి. ఆటలు, పాటలు, సరదాలు సంతోషాలు, ఆనందం, ఉత్సాహం, కలగలిపి భవిష్యత్ కోసం కలలు కంటూ స్నేహితులతో ఎటువంటి కల్మషం లేకుండా గడిపే జీవితం.. స్టూడెంట్ లైఫ్.. మనుషులు ఎంత పెద్దవారైనా.. సమాజంలో ఏ స్టేజ్ లో ఉన్నా సరే… ప్రతి రోజూ ఒక్కసారైనా జీవితంలో తలచుకుని అందమైన జ్ఞాపకం స్టూడెంట్ లైఫ్. అటువంటి స్టూడెంట్ లైఫ్ ను సామాన్యులే కాదు, సెలబ్రటీలు, రాజకీయ నేతలు, క్రీడాకారులు ఇలా ప్రతి ఒక్కరూ ఏదొక సందర్భంలో తలచుకుంటూనే ఉంటారు. తాజాగా ఓ దక్షిణాది విలక్షణ హీరోయిన్ స్కూల్ లైఫ్ కు చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటోలో ఉన్న హీరోయిన్ మంచి నటి, డ్యాన్సర్ మాత్రమే కాదు.. డాక్టర్ కూడా ఎవరో మీరు గుర్తు పట్టారా..!

ఆమె ఎవరో కాదు భానుమతి.. సింగిల్ పీస్..అంటూ తెలుగుప్రేక్షకుల మనసు దోచిన సాయి పల్లవి. బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టి.. ఢీ వంటి షోలో డ్యాన్సర్ గా తన ప్రతిభతో ప్రశంసలను అందుకున్నది కేరళ కుట్టి. మలయాళం ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ వెండి తెరపై అడుగు పెట్టిన సాయిపల్లవి.. టాలీవుడ్ లో ఫిదా సినిమాలో భానుమతిగా తన నటనతో ప్రేక్షకులను పరవశులను చేసింది. అచ్చ తెలుగు అమ్మాయిలా .. కాదు మన పక్కింటి అమ్మాయిలా కనిపించే సాయి పల్లవి నిజ జీవితం లో కూడా అంతే సింపుల్ గా జీవిస్తుందని పలు సందర్భాల్లో వెల్లడైంది. తాజాగా విరాట పర్వం సినిమాతో సాయి పల్లవి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..