AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మ్యాజిక్ రిపీట్.. యూవీ పూనాడా ఏంటి..?.. ఓకే ఓవర్‌లో 6 సిక్సులు బాదిన కృష్ణ పాండే

6బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం అంటే మాములు విషయం కాదు. అయినప్పటికీ మరోసారి ఈ రికార్డు రిపీట్​ అయ్యింది. ఓ యంగ్ ప్లేయర్ ఆకాశమే హద్దుగా సిక్సర్లతో చెలరేగిపోయాడు.

Viral Video: మ్యాజిక్ రిపీట్.. యూవీ పూనాడా ఏంటి..?.. ఓకే ఓవర్‌లో 6 సిక్సులు బాదిన కృష్ణ పాండే
Krishna Pandey 6 Sixes
Ram Naramaneni
|

Updated on: Jun 05, 2022 | 2:43 PM

Share

6 sixes in 6 balls: 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టడం అంటే మామలు విషయం కాదు. ఇలాంటి మ్యాజిక్స్ అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. అసలు 6 బంతుల్లో 6 సిక్స్‌లు అనగానే మనకు గుర్తొచ్చేది.. ఒకప్పటి ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh). 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యూవీ చేసిన ఈ అద్భుతాన్ని ఊహించుకున్నా చాలు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఏమన్నా సిక్సులా అవి. బ్రాడ్ బౌలింగ్​లో  ఒక దాని వెంట ఒకటి.. ఒకదాని వెంట ఒకటి.. వరసగా స్టాండ్స్‌కి పంపించాడు. గ్రౌండ్‌లోని ఫీల్డర్లని కూడా వీక్షకులను చేశాడు. ఈ మ్యాజిక్ తాజాగా మరోసారి రిపీటయ్యింది. పుదుచ్చేరి(Puducherry) వేదికగా జరుగుతున్న టీ 10 లీగ్​లో ఈ రేర్ ఫీట్ మరోసారి ఆవిష్కృతమైంది. ఓ యువ ఆటగాడు 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి.. టీ 10 చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

శనివారం రాయల్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల కృష్ణ పాండే మెరుపు షాట్లతో విరుచుకుపడ్డాడు. పేట్రియాట్స్ జట్టు ఇన్నింగ్స్ సమయంలో 6వ ఓవర్​ను వేయడానికి బౌలర్​ నితేష్‌ ఠాకూర్‌ వచ్చాడు. అతని పట్టపగలే చుక్కుల చూపించాడు  కృష్ణ పాండే.  గ్రౌండ్ నలువైపులా సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్​లో కేవలం 19 బంతులు మాత్రమే ఆడిన కృష్ణ పాండే ఏకంగా 12 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మొత్తంగా 83 రన్స్ చేశాడు. కృష్ణ.. ఈ రేంజ్‌లో ఆడినప్పటికీ పేట్రియాట్స్ జట్టు ఈ మ్యాచ్​లో 4 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యింది.  ప్రస్తుతం కృష్ణ పాండే ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్