AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartik Aaryan: రెండోసారి కరోనా బారిన పడిన స్టార్‌ హీరో.. ఐఫా అవార్డ్స్‌ ఫంక్షన్‌కు దూరం..

Corona Virus: జాగా స్టార్‌ హీరో కార్తిక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan) కరోనా బాధితుల జాబితాలో చేరిపోయాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తనకు కరోనా సోకినట్లు ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీంతో ఐఫా అవార్డ్స్‌- 2022 ఉత్సవాలకు కార్తిక్‌ దూరం కానున్నాడు.

Kartik Aaryan: రెండోసారి కరోనా బారిన పడిన స్టార్‌ హీరో.. ఐఫా అవార్డ్స్‌ ఫంక్షన్‌కు దూరం..
Kartik Aaryan
Basha Shek
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 05, 2022 | 8:31 AM

Share

Corona Virus: కరోనా వైరస్‌ మనతో దోబూచులాడుతోంది. ఇప్పటికే మూడు దఫాలుగా విజృంభించి ముప్పుతిప్పలు పెట్టిన ఈ మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపిస్తోంది. దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ లాంటి ప్రముఖులు ఈ వైరస్‌ బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది. అంతకు ముందు అక్షయ్‌ కుమార్‌ లాంటి సెలబ్రిటీలు కూడా కరోనాకు గురయ్యారు. తాజాగా స్టార్‌ హీరో కార్తిక్‌ ఆర్యన్‌ (Kartik Aaryan) కరోనా బాధితుల జాబితాలో చేరిపోయాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తనకు కరోనా సోకినట్లు ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీంతో ఐఫా అవార్డ్స్‌- 2022 ఉత్సవాలకు కార్తిక్‌ దూరం కానున్నాడు. కాగా అతను కరోనా బారిన పడడం ఇది రెండోసారి. గత ఏడాది మార్చిలో మొదటిసారిగా కొవిడ్‌ కోరలకు చిక్కాడు. కాగా కరోనా నుంచి తమ హీరో త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

కాగా బాలీవుడ్‌లో స్వశక్తితో ఎదిగిన హీరోల్లో కార్తిక్‌ ఒకరు. ప్యార్ కా పంచ్ నామా, లుకా చప్పీ, పతి, పత్నీ ఔర్ వో, లవ్ అజ్ కల్-2 తదితర సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఆర్యన్‌ తాజాగా నటించిన చిత్రం భూల్ భూలయ్యా-2. కియరా అడ్వాణీ హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే రూ.130కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టినట్లు ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఫ్రెడ్డీ చిత్రంలో నటిస్తున్నాడు కార్తిక్‌. అదేవిధంగా అలవైకుంఠపురం హిందీ రీమేక్‌ షెహ్‌జాదే చిత్రంలోనూ నటిస్తున్నాడు. కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: హార్స్‌ రేసింగ్‌ ట్రాక్‌లోకి దూసుకొచ్చిన మొసలి.. హడలిపోయిన గుర్రం.. చివరకు ఏం జరిగిందంటే..

6 బంతుల్లో 6 సిక్సర్లు.. సునామీ ఇన్నింగ్స్‌తో బౌలర్ల ఊచకోత.. ప్లేయర్ ఎవరో తెలుసా!

Viral News: రెండోసారి ఆడపిల్లే పుట్టిందని కోడలిపై అత్తింటి సభ్యులు దాడి.. రోడ్డు మీద చిత్ర హింసలు..