6 బంతుల్లో 6 సిక్సర్లు.. సునామీ ఇన్నింగ్స్‌తో బౌలర్ల ఊచకోత.. ప్లేయర్ ఎవరో తెలుసా!

ఆరు బంతుల్లో 6 సిక్సర్లతో చెలరేగిపోయిన ఈ భారత ప్లేయర్.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీ10 లీగ్‌లో అరుదైన రికార్డును నెలకొల్పాడు.

6 బంతుల్లో 6 సిక్సర్లు.. సునామీ ఇన్నింగ్స్‌తో బౌలర్ల ఊచకోత.. ప్లేయర్ ఎవరో తెలుసా!
T10 Cricket
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 04, 2022 | 9:58 PM

6,6,6,6,6.. 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు ఈ యువ ప్లేయర్. టీమిండియా స్టార్ ఆటగాడిని గుర్తుచేస్తూ మెరుపు ఇన్నింగ్స్‌తో బౌలర్లపై చెలరేగిపోయాడు. సరికొత్త రికార్డు సృష్టించాడు కానీ.. జట్టుకు విజయాన్ని మాత్రం ఇవ్వలేకపోయాడు. అసలు ఆ మ్యాచ్ ఏంటి.? ఆ బ్యాట్స్‌మెన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

పాండిచ్చేరి టీ10 లీగ్‌లో అరుదైన రికార్డు నమోదైంది. పెట్రియాట్స్ జట్టు ప్లేయర్ కృష్ణ పాండే 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదేసి.. యువరాజ్ సింగ్‌ను మరోసారి గుర్తు చేశాడు. ప్రత్యర్ధి రాయల్స్ జట్టు ప్లేయర్ నితీష్ కుమార్ వేసిన ఆరో ఓవర్‌లో పాండే ఈ ఫీట్ సాధించాడు. ఆ ఓవర్‌లో కృష్ణ పాండే.. యువరాజ్ సింగ్‌ను మరిపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

19 బంతులు ఎదుర్కున్న కృష్ణ పాండే 12 సిక్సర్లు, 2 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. తన సునామీ ఇన్నింగ్స్‌తో జట్టును విజయానికి చేరువయ్యేలా చేసిన పాండే.. చివరికి నిరాశతో పెవిలియన్ చేరాడు. 158 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పెట్రియాట్స్ జట్టు కృష్ణ పాండే మెరుపులకు నిర్ణీత 10 ఓవర్లలో 153 పరుగులు చేయగలిగింది. ఇతర బ్యాట్స్‌మెన్లు కీలక సమయాల్లో ఔట్ కావడంతో ఆ జట్టు 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.