AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 2019 ప్రపంచ కప్ ఫైనల్‌‌ను గుర్తు చేసిన ప్లేయర్.. సేమ్ టూ సేమ్ యాక్షన్.. మైదానంలో నవ్వులే నవ్వులు.. ఎందుకో తెలుసా?

లార్డ్స్‌లోనే జరిగిన 2019 ప్రపంచ కప్ ఫైనల్‌లో, బెన్ స్టోక్స్ (Ben Stokes) బ్యాట్‌కు తగిలిన బంతి బౌండరీ వద్దకు వెళ్లింది. ఇది మ్యాచ్‌ను టై చేయడంతోపాటు..

Video: 2019 ప్రపంచ కప్ ఫైనల్‌‌ను గుర్తు చేసిన ప్లేయర్.. సేమ్ టూ సేమ్ యాక్షన్.. మైదానంలో నవ్వులే నవ్వులు.. ఎందుకో తెలుసా?
Ben Stokes
Venkata Chari
|

Updated on: Jun 05, 2022 | 6:50 AM

Share

జులై 14, 2019 క్రికెట్ అభిమానుల జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోయే రోజు అది. ప్రపంచకప్ చరిత్రలో, లేదా క్రికెట్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ని ప్రదర్శించిన రోజు అది. అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్ జరిగిన రోజు. న్యూజిలాండ్ (England vs New Zealand)ను ఆశ్చర్యపరిచే రీతిలో ఓడించి ఇంగ్లండ్ టైటిల్ గెలుచుకుంది. ఆ చిరస్మరణీయ మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ విజయానికి హీరోగా మారాడు. అతని బ్యాట్ జోక్యంతో ఇంగ్లండ్ ఓటమిని తప్పించుకుంది. ఆ మ్యాచ్‌లో రన్ తీసే క్రమంలో స్టోక్స్ బ్యాట్‌కు బంతి తగిలి బౌండరీ వైపు వెళ్లింది. దీంతో మ్యాచ్‌ను టై చేయడానికి ఎంతగానో దోహదపడిందనేది. న్యూజిలాండ్ వాసులకు ఇది చాలా బాధాకరంగా మిగిలింది. అది అంతా గతం. తాజాగా సుమారు 3 సంవత్సరాల తర్వాత, న్యూజిలాండ్‌కు అచ్చం అలాంటి సీన్ భయపెట్టింది. మరోసారి ఆ స్థానంలో లార్డ్స్ ఉండగా, అలాంటి పాత్రనే బెన్ స్టోక్స్ మరోసారి పోషించాడు.

2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ క్రీడా చరిత్రలో అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది. లార్డ్స్‌లోని చారిత్రక మైదానంలో ఈ చిన్న స్కోరు హీట్ పెంచింది. మ్యాచ్ చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ ఫీల్డర్ మార్టిన్ గప్టిల్ స్టోక్స్‌ను రనౌట్ చేయడానికి వికెట్ కీపర్ వైపు బంతిని విసిరాడు. ఆ సమయంలో స్టోక్స్ డైవ్ చేయడంతో బంతి అతని బ్యాట్‌కు తగిలి నాలుగు పరుగుల వద్దకు వెళ్లింది. ఇంగ్లండ్‌కు 6 పరుగులు వచ్చాయి. దీని కారణంగా స్టోక్స్ చివరి రెండు బంతుల్లో మ్యాచ్‌ను టై చేయగలిగాడు. దీని తర్వాత సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఎక్కువ బౌండరీలు కొట్టినందుకు ఇంగ్లాండ్‌ను ఛాంపియన్‌గా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

అలాంటి సీన్ తాజాగా మరోసారి..

ఈ సంఘటన జరిగి దాదాపు 3 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు కూడా ఆ మ్యాచ్ ప్రస్తావన వచ్చింది. స్టోక్స్ రన్ తీసే క్రమంలో బ్యాట్‌కు బంతి తగిలింది. 3 సంవత్సరాల తర్వాత రెండు జట్లూ మరోసారి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవరికి తెలుసు. రెండు జట్ల మధ్య జరుగుతున్న లార్డ్స్ టెస్ట్ మూడో రోజు మూడో సెషన్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని జో రూట్ పుల్ చేశాడు. స్క్వేర్ లెగ్ ఫీల్డర్ డైవ్‌తో అడ్డుకున్నాడు.

ఇంతలో, స్టోక్స్ ఒక పరుగు తీసుకోవడానికి క్రీజు నుంచి బయటకు వచ్చాడు. అయితే ఫీల్డర్ త్రో వచ్చిన వెంటనే అతను క్రీజులోకి వచ్చాడు. కానీ, 14 జులై 2019 నాటి యాక్షన్ రీప్లే కనిపించింది. ఈసారి కూడా బంతి స్టోక్స్ బ్యాట్‌కు తగిలి అవతలి వైపు వెళ్లింది.

స్టోక్స్ బ్యాట్‌కి బంతి తగిలి, బౌండరీ వైపు వెళ్లడం మొదలుపెట్టింది. ఈక్రమంలో రన్ ఇవ్వవద్దని బెన్ స్టోక్స్ అంపైర్‌కు సూచించడం ప్రారంభించాడు. అయితే, ఈసారి బంతి 4 పరుగుల వద్దకు వెళ్లలేదు. ఫీల్డర్ దానిని ఆపాడు. కానీ ఈసీన్ మాత్రం ప్రపంచ కప్ ఫైనల్‌ను గుర్తు చేసింది. స్టోక్స్, రూట్‌తో సహా న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా బిగ్గరగా నవ్వారు. అయితే వ్యాఖ్యాన ప్యానెల్‌లో కూర్చున్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వ్యాఖ్యాతలు తమ నవ్వును ఆపుకోలేకపోయారు.

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌.. 8 వేల మైళ్లు ప్రయాణించి...
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
ఓ మహిళతో ప్రేమ.. మరో మహిళతో నిశ్చితార్థం.. చివరకు..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!