F3 Movie: అప్పుడు మహేశ్‌.. ఇప్పుడు వెంకీమామ.. స్టేజ్‌పై డ్యాన్స్‌తో అదరగొట్టిన చిన్నోడు, పెద్దోడు..

F3 Movie: విశాఖ వేదికగా జరిగిన ఎఫ్‌-3 సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడితో కలిసి కుర్రాడు బాబోయ్‌ పాటకు స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు వెంకటేశ్. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి.

F3 Movie: అప్పుడు మహేశ్‌.. ఇప్పుడు వెంకీమామ.. స్టేజ్‌పై డ్యాన్స్‌తో అదరగొట్టిన చిన్నోడు, పెద్దోడు..
F3 Movie
Follow us
Basha Shek

|

Updated on: Jun 05, 2022 | 5:16 PM

F3 Movie: సాధారణంగా పెద్ద హీరోలు, సూపర్‌ స్టార్లు ఆన్‌స్ర్కీన్‌పై మాత్రమే డ్యాన్స్‌లు చేస్తుంటారు. ఆడియో ఫంక్షన్లు, ప్రి రిలీజ్‌ ఈవెంట్లలో కేవలం ప్రసంగాలకే పరిమితమవుతుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్‌ మారింది. అభిమానులను అలరించడానికి బడా హీరోలు సైతం స్టేజిపై అదరగొట్టే డ్యాన్స్‌ లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం సర్కారు వారి పాట సెలబ్రేషన్స్‌లో మొదటిసారి స్టేజిపై డ్యాన్స్‌ చేశాడు సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు. కర్నూలు వేదికగా జరిగిన ఈ ఈవెంట్‌లో ‘మ మ మహేశా’ అంటూ థమన్‌తో కలిసి ఊర మాస్‌ స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తాజాగా దగ్గుబాటి హీరో వెంకీమామ ఈ జాబితాలో చేరాడు. విశాఖ వేదికగా జరిగిన ఎఫ్‌-3 సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడితో కలిసి కుర్రాడు బాబోయ్‌ పాటకు స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు వెంకటేశ్. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి.

100 కోట్ల క్లబ్‌లో..

కాగా వెంకీమామ, వరుణ్‌ తేజ్‌లు కలిసి నటించిన ఎఫ్‌3 చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరింది. మే 27న సమ్మర్‌ స్పెషల్‌గా విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఎఫ్ 2 కు మించి ఈ సినిమాలో కామెడీ డోస్‌ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. సొనాల్‌ చౌహాన్‌ అతిథి పాత్రలో మెరవగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌తో అలరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Mitchell Marsh: భారత్‌లో నాకు శాపం తగిలిందేమో.. అందుకే ప్రతిసారి గాయాలు.. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ షాకింగ్‌ కామెంట్స్‌..

Nikhil Siddharth: నిఖిల్‌ పాన్‌ ఇండియా మూవీ నుంచి అప్‌డేట్‌ వచ్చేస్తోంది.. ఇంట్రో గ్లింప్స్‌కు ముహూర్తం ఖరారు..

Mitchell Marsh: భారత్‌లో నాకు శాపం తగిలిందేమో.. అందుకే ప్రతిసారి గాయాలు.. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ షాకింగ్‌ కామెంట్స్‌..